సీఎం పదవికి అర్జున్ ముండా రాజీనామా జార్ఖండ్ లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సీఎం అర్జున్ ముండా అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. రాష్ర్ట అసెంబ్లీని రద్దు చేయాల్సిందిగా గవర్నర్ కు సిఫార్సు చేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఆ వెంటనే అర్జున్ ముండా గవర్నర్ సయ్యద్ అహ్మద్ ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. అంతకుముందు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబూసోరెన్ ఉదయం గవర్నర్ తో భేటీ అయి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఏపార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో చెరో రెండున్నరేళ్లు ప్రభుత్వాన్ని బీజేపీ, జేఎంఎంలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అధికార మార్పిడి ఒప్పందాన్ని బీజేపీ ఉల్లఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎంఎం అధినేత శిబూసోరెన్ చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత తమకు అధికారం అప్పగించాలన్న ఒప్పందం ఉందని... ఈ గడువు ఈ నెల 10తో ముగుస్తుందని జేఎంఎం అంటోంది. అయితే అర్జున్ ముండా మాత్రం అలాంటి ఒప్పందమేదీ లేదంటున్నారు. మొత్తానికి జార్ఖండ్ లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: