భారత దేశంలో రోజు మహిళలపై అత్యచారాలు హత్యలు జరుగుతున్న వార్తలు చదువుతూనే ఉన్నాం..అయితే నింధితులను నిర్భయ చట్టం కింద కఠినంగా శిక్షిస్తున్న కొంత మంది కామంతో కళ్లు మూసుకు పోయి వారి దుశ్చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం, కేరళకు చెందిన 26 ఏళ్ల యువతి గత ఐదేళ్లుగా రాజమహేంద్రవరంలో ఉంటున్నది.శనివారం రాత్రి డెకరేషన్‌ పనులు చూడటానికి టీటీడీ కళ్యాణ మండపానికి స్కూటీపై వెళ్లింది. ఆ యువతి తిరిగి వస్తుండగా, నలుగురు రౌడీ షీటర్లు ఆమెను అటకాయించారు.

బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని దివాన్‌ చెరువు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసువెళ్లి పైశాచికంగా ఆమెపై అత్యాచారం చేశారు..ఎంత బ్రతిమలాడినా వారు వినిపించుకోకుండా ఆమెను కొట్టి తమ కామవాంచ తీర్చుకున్నారు..అయితే తను ప్రాణాలతోనైనా విడిచిపెట్టాలని ప్రాదేయపడగా..బైకుపై ఎక్కించుకొని నగరానికి తిరుగు పయనమయ్యారు. నందం గనిరాజు సెంటర్‌కు రాగానే, వారు ప్రయాణిస్తున్న బైక్‌ అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన యువతికి చెయ్యి విరిగింది. స్వల్ప గాయాలతో బయటపడిన రౌడీ షీటర్లు.. ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చి, పరారయ్యారు.

పట్టుబడిన నింధితులు


అయితే సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు వారిని గుర్తించారు.  రాజేంద్రనగర్‌కు చెందిన కుక్కల సతీశ్‌, బాబి, స్టిక్‌ అలియాస్‌ వీ రాజు, తాడేపల్లి ప్రేమ్‌కుమార్‌లుగా ధ్రువీకరించుకొన్నారు.  విషయం తెలుసుకున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నింధితులను వెంటనే శిక్షించాలని ర్బన్‌ ఎస్పీ హరికృష్ణ కు ఆదేశించారు. బాధితురాలికి అత్యవసర వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశం మేరకు పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: