భారత దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే..ఈ నేపథ్యంలో తాజాగా పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి నాల్గవ విడత పోలింగ్‌ ఈ రోజు జరుగుతుంది. ఇప్పటికే మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్నో హింసాత్మక సంఘటలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే..ప్రస్తుతం  జరుగుతున్ననాలుగోదశ పోలింగ్ సందర్భంగా ఎటువంటి హింసకు తావులేకుండా ఎన్నికల సంఘం (ఈసీ) అసాధారణ రీతిలో భద్రతాఏర్పాట్లుచేసింది. ఉత్తర 24 పరగణాలు, హౌరా, బిధాన్‌నగర్ జిల్లాల పరిధిలోని 49 స్థానాలకు సోమవారం జరిగే పోలింగ్ కోసం 672 కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లతోపాటు రాష్ర్టానికి చెందిన 22 వేల మంది పోలీసులను ఈసీ నియమించింది.

రాష్ట్ర చరిత్రలో తొలిసారి గత రెండు రోజులుగా రాత్రివేళలో హౌరా నదిపైనా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. జిల్లాకో పోలీస్ అధికారిని ఎన్నికల పర్యవేక్షకుడిగా నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరు గుతుంది. రాష్ట్రంఓని నాల్గవ దశ ఎన్నికలలో మొత్తం 345 మంది అభ్యర్దులు పోటీ చేస్తున్నారు. వీరిలో అమిత్‌ మిత్ర, పూర్ణేందు బసు, చంద్రిమ భట్టాచార్య, బ్రత్యబసు, జ్యోతిప్రియో మల్లిక్‌, అరూ ప్‌రారు తదితర తృణమూల్‌ మంత్రులు ఉన్నారు. నాల్గవ దశ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్ధులలో 40 మంది మహిళలు ఉండటం విశేషం.



ఓటింగ్‌ జరుగుతున్న జిల్లాలు:


నార్త్‌ 24 పరగణాస్‌, హౌరా 
ఎన్నిక జరుగుతున్న మొత్తం స్థానాలు: 49
పోటీ పడుతున్న అభ్యర్థులు: 345 
ఓటర్లు: 1.08 కోట్ల మంది
విధినిర్వహణలో వున్న బలగాలు: 672 కంపెనీల కేంద్ర పోలీసులు, 22,000 రాష్ట్ర పోలీసులు
మహిళా అభ్యర్థులు: 40 మంది


మరింత సమాచారం తెలుసుకోండి: