గత కొంత కాలంగా ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్ది సంఘం అద్యక్షుడు కన్హయ్య కుమార్ ఏదో రూపంలో వార్తలలో ఉంటున్నాడు. ముఖ్యంగా విద్యార్థి నాయకుడిగా కేంద్రంలో అధికార పార్టీపై తిరగబడి మాట్లాడటంతో అటు ప్రతిపక్షానికి కూడా మంచి ఆయుధం దొరికిందని సంబర పడుతున్నారు. కన్హయ్య కుమార్ హైదరాబాద్ కూడా వచ్చివెళ్లారు..ఈ సమయంలో ఆయనపై చెప్పులతో దాడి జరిగింది. ఇప్పటికే కన్నయ్య పై పలు మార్లు దాడులు జరిగాయి. మరోవైపు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా తనను విమానంలో తోటి ప్రయాణికుడు తన పీకనులిమి చంపబోయాడంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత  కన్హయ్య కుమార్ ఫిర్యాదు చేశారు.   ‘ఈ సారి విమానంలో దాడి. ఒక వ్యక్తి నా పీకనులిమాడు. నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు’అని ట్విటర్‌లో పేర్కొన్నారు.  దాంతో భద్రతా కారణాలతో అతనిని విమానం నుంచి దించి రోడ్డు మార్గంలో పూణెకి విమాన సిబ్బంది పంపించారని కధనం. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. పుణేలో టిసిఎల్ లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33) అనే వ్యక్తి ఈ దాడి చేశాడని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.


ప్రాథమిక ఆధారాలను బట్టి సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.  అయితే తనకు అప్పటికే కాలు ఉందని దాని నుంచి  నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుందన్నాడు. అసలు కన్హయ్య అనే అతను ఎవరో తనకు తెలియదన్నాడు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించిందని మహారాష్ట్ర హోంశాఖ సహాయమంత్రి రామ్‌ షిండే తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: