“ప్రపంచము లో క్షమార్హము కాని విషయాలు ముఖ్యంగా మూడు. అవి భేషజం, అవినీతి, కౄరత్వం” .... ఫ్రెడ్రిక్ రాబిన్సన్.*ప్రపంచ నాయకుడు అనబడ్డ అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నే స్వయంగా ఇంత ఖరీదైన హెలీకాప్టరులు మేము కొనలేము అని ఆగస్టా విషయంలో అప్పటికే ఉటంకించిన సంధర్భం ఉన్నా  *భేషజం (డంబాచారం, ఆడంబరం, ఉన్నదానికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లు భ్రమపడేఅలా ప్రవర్తించటం) తో ఆ హెలీకాప్టరులే కొనటానికి సిద్దపడ్డవైనం.మూడువందల అరవై కోట్ల ముడుపుల బాగోతం అదీ వైమానిక దళాధిపతి పై నిర్దేశించే స్థాయిలోని వ్యక్తులపై *అవినీతి ఆరోపణలు దెశ ప్రముఖులు  ప్రయాణించవలసిన, అదీ దేశ రక్షణ శాఖ కక్కుర్తి పడి వారి ప్రాణాలు గాలిలో కలిసినా  సహించటానికి సిద్ధపడ్డ *కౄరత్వం ఇందులో ఇమిడి ఉంది.  ఎంతో గొప్పవైన మరో కంపనీ తయారీ హెలీకాప్టరులు తక్కువ ధరలో లభ్యమౌతున్నా. నాసిరకం హెలీకాప్టర్స్ కొనటంలోని దౌర్భాగ్యాన్ని మనం భరించాలా!

 


“కంప్ట్రోలర్  అండ్  ఆడిటర్  జనరల్ ఆఫ్  ఇండియా  (కాగ్)”   రిపోర్టుని అసరాగా చేసుకొని ఇటలీ కోర్ట్ ఇచ్చిన తీర్పు “ఆగస్టావెస్టులాండ్”  మూల  సంస్థ “ఫిన్మెకానికా”  అధిపతిని  దోషిగా  ప్రకటించటమేకాదు  అరెష్టు కూడా చేసింది.  విదేశీ కోర్టులు  సహితం  కాగ్  నివేదిక లను ప్రామాణికంగా  తీసుకొని ఇచ్చిన తీర్పే కాగ్ విశిష్టతలను, ఆడిటింగ్ విధానాలను అబినందించినట్లే.  మనమూ ఆ రిపోర్టుల అంశాలను అంగీకరించాలసిందే. 2013 లో కాగ్ అధిపతి వినోద్ రాయ్ తన నివేదికలో రక్షణశాఖ కోరినట్లు ప్రభుత్వావసరాలకు 19000 అడుగుల ఎత్తులో ఎగరగలిగే హెలీకాప్టర్లు  అవసరమని నిర్దేశించింది. కాని ఆగస్టా సంస్థ తయారుచేసిన హెలీకాప్టర్లు  ఆ సామర్ధ్యం లేదని అవి 15000 అడుగులకు మించి ఎగర లేవని అందువలన ఆగస్టానుండి హెలీకాప్టర్లు  కొనరాదని తెలిపినా నాటి ప్రభుత్వం ఆగస్టా విమానాలనే కొనటము లోని ఔచిత్యమేమిటని ప్రశ్నించటంతో ఈ స్కాము బయటపడింది.  19000 అడుగులు పైగా ఎగరగల సమర్ధవంతమైన ఫ్రెంచ్  హెలికాప్టర్లు సరసమైన ధరలో లభించినా వాటిని నిర్లక్ష్యం చేసి ఇటలికి చెందిన అగస్తావెస్టులాండ్ హెలికాప్టర్లు కొనటంలో మర్మం జగత్తుకు తెలిపింది కాగ్ వినొద్ రాయ్ నివేదికే. అదే ఇటలీ లోని మిలాన్ కోర్ట్ ఆధారంచేసుకొని విచారణ జరిపి నేర నిరూపణ చేసి మాజీ అగస్టా అధిపతిని అరెష్టు చేయించింది. కాని ఇండియాలో ఇంత పకడ్బందీగా నేరవిచారణ జరగలేదు, ఏ సంస్థా జరపలేదు. కారణం "రాజ్యాగంలో ఎందరు దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, కాని ఒక్క నిర్దోషి కూడా శిక్షించపడ కూడదు" అని రాసి ఉండటమే. దీని చాటున ఎందరు నేరస్థులో ఉన్నత స్థాయిలో ఉన్నవారు తప్పించుకుంటున్నారు. వీరే తరువాతి కాలములో రాజకీయాల్లోకి వచ్చి మొత్తం జాతినే అవినీతి మయం చేస్తున్నారు.



 

ఈ హెలీకాప్టర్లు పర్వతమయమైన నార్త్-ఈష్ట్రెన్ ఇండియాకు డిఫెన్స్ అవసరాలకు ప్రముఖులు ప్రయాణించటానికి అనుకూలం కావని తెలిపింది. కాని 300 కోట్ల ముడుపులను ఆసించి ఎగరవలసిన ఎత్తును తగ్గించి చూపి నాటి ఏఇర్ఫొర్స్ చీఫ్ త్యాగి ఆగస్టాతో కుమ్మక్కై ఈ కొనగోలును ముడుపులతో సమ్మతించారని ఇటలీ కోర్టు తెలిపింది. ఒక విదేశీ కోర్ట్ ఆ రిపోర్టుపై స్పందించి నేరస్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొంటే, అదే రిపోర్టు పై స్పందించ టానికి నేరస్తులపై చర్యలు తీసుకోవటానికి మన కొచ్చిన ఇబ్బందులేమిటి?  ఇంత కాలయాపన ఎందుకు?  ఆలస్యం అమృతం విషం అంటారు కనీసం ఇక్కడ ఆలస్యం అసలు విషయాన్ని జావకార్చివేసి నిందితులు తప్పించుకోవటానికి దారి కల్పిస్తుంది?  ప్రభుత్వాలకు అదే కావాలా? ప్రజలకు మేలు జరగటం ప్రధానం కాదా? జాతి సంపద అవినీతి, మోసం, ఫొర్జరీ, హవాలా మార్గాల్లో తరలి పోవటాన్ని బిజేపి ప్రభుత్వం సహితం తక్షణం నివారించలేదా?



 

ఇప్పుడు చెప్పొచ్చేదేమంటే, ఈ స్కాములోని అనేక మర్మాలను అటు ఈ.డి కాని ఇటు సి.బి.ఐ కాని వెల్లడించలేక పోయాయి. పీటెర్ హ్యులెట్ (ఇండియా ఆగస్టా అధినేత) మరియు జేంస్ క్రిస్టియన్ మైఖేల్ (ఈ ఒప్పందంలో మిడిల్-మాన్) మధ్య జరిగిన సమాచారం మొత్తాన్ని మిలాన్ కోర్టు బయటపెట్టింది. అప్పుడే దేశానికి ఏఅ పాపం బయటకు ముఖ్యముగా ఇండియన్సు కు తెలిసింది. భారత దర్యాప్టు సంస్థలు చట్టపరంగా ప్రభుత్వానికి భాధ్యత వహిస్తాయి. అందువలన ఇలాంటి విషయాలను ప్రభుత్వాలు బయట పెట్టనివ్వవు. అదే ఈ రెస్పోన్సిబిలిటీని పార్లమెంటుకు షిఫ్ట్ చేస్తే తద్వారా ప్రజలకు తెలుస్తాయి. మిలాన్ కోర్టులో చర్చకు వచ్చిన పేర్లు వింటే అసలు ఈ దేశాన్ని, జాతిని ఎవడూ కాపాడలేడని భావించవలసి వస్తుంది.


 

ఆపేర్లు...ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్, అహ్మద్ పటెల్, ఆస్కార్ ఫెర్నాండెజ్. ఇంకా ఈ కథ వెనుక కధకుడు ఎవరో తెలుసా!  సిగ్నోరా గాంధి. ఇటలీలో పెళ్ళి ఐన స్త్రీ పేరు ముందు వాడే గౌరవ వాచకం. మనం వాడే శ్రీమతి. అంటే శ్రీమతి సోనియా గాంధి.  ఈ ఆగస్టావెస్టులాండ్ చాఫర్ స్కాము లో నిండా ఇరుక్కున్న కాంగ్రెస్ చట్టసభల్లో గందరగోళం సృష్టిస్తూ, బిజేపి ప్రభుత్వాన్ని సమర్దవంతంగా పని చేయనీ కుండా అడ్డుకొంటూ వస్తుంది. కాంగ్రెసుకు బోఫొర్సు స్కాము నుంచి తప్పించుకున్న అనుభవాన్ని మరల ఇప్పుడు ప్రయోగిస్తుంది. అప్పుడు తానే అధికారంలో ఉండి బోఫొర్స్ డీల్ మిడిల్-మాన్ ఒట్టవియో ఖత్రోచిని రహస్యంగా దేశమునుంచి తప్పించుకునేలా చేసింది.


 

ఇప్పుడు బిజేపి అధికారములో ఉంది. అంతే కాదు నాటి ఏ.కే. ఆంటోనీ కూడా స్కాము జరిగిందని అంగీక రించారు. సి.బి.ఐ, ఈ.డీలు కూడా ఆంటోని వాఖ్యలను ప్రాతిపదికగా చేసుకొని దోషులను అరెష్టు చేయకపోటే వీళ్ళూ నాటి ఒట్టావియా ఖత్రోచిలాగా, లేదా ఇప్పటి విజయమాల్యా లాగా దేశం దాటటమే కాదు ఈ జాతిని ముంచే ప్రమాదమూ ఉంది. బిజేపి ప్రభుత్వం చేతిలో ఇప్పుడు ఈ.డి., సి.బి.ఐ., కి తోడుగా మిలాన్ కోర్ట్ సహకారం వివిధ ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దోషులను శిక్షిస్తే దేశపరువు ప్రభుత్వ ప్రతిష్ట రెండూ ఇనుమడిస్తాయి. ఈ విషయములో మీడియా సహకారం కూడా సంపూర్ణంగా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: