డీజిల్ కార్లపై సుప్రీం కోర్టు నిషేధం విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. మే ఒకటో తారీఖు నుంచి ఇక రోడ్లపై తిరగాడనికి వీల్లేదు.. మీది డీజిల్ కారా.. అయ్యే అని కంగారు పడుతున్నారా.. అయితే ఒక్క షరతు. ఇది కేవలం ఢిల్లీ నగరానికి మాత్రమే వర్తిస్తుంది. మీరు ఢిల్లీ వాసులు కాకపోతే నో ప్రాబ్లమ్. ఢిల్లీ వాసులైతే మాత్రం ఇబ్బంది తప్పదు. 

ఈ తీర్పు ఎందుకంటే ఢిల్లీలో రోజు రోజుకూ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందట. అందుకే డీజిల్ బదులు సీఎన్ గ్యాస్ వాడాలని సుప్రీం కోర్టు చెబుతోంది. డీజిల్ క్యాబ్‌ల స్థానంలో సీఎన్‌జీ గ్యాస్‌తో నడిచే క్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో డీజిల్ కార్ల రిజిస్ట్రేషన్ లను అక్కడి ప్రభుత్వం నిలిపేసింది. ఈ నిర్ణయంపై కొన్ని కార్ల కంపెనీలు సుప్రీం కోర్టుకు వెళ్లారు. 

డీజిల్ కార్లపై నిషేధం..! 

మెర్సిడస్‌, టొయోటా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, జనరల్‌ మోటార్స్‌ వంటి కంపెనీలు డిల్లీ సర్కారు నిర్ణయంపై సుప్రీంకోర్టులో పిటీషన్‌లను దాఖలు చేశాయి. ఇందులో 2,000 సీసీ, అంతకంటే ఎక్కువ కెపాసిటీ గల కార్ల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశాయి. ఈ పిటీషన్లంటిపైనా కోర్టు విచారణ ప్రారంభించింది. డీజిల్ క్యాబ్‌లపై నిషేధం విధించింది. 

డీజిల్‌ వాహనాల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధం మే 9వ తేదీ వరకు కొనసాగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది. సో.. ఇకపై డీజిల్ కార్ ఉంటే.. దాంట్లో సీఎన్ గ్యాస్ కిట్ అమర్చుకుంటే గానీ రోడ్లపైకి తీసుకు వచ్చేందుకు అవకాశంలేదన్నమాట. పర్యావరణం కోసం కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఇలాంటి కఠిన చర్యలు తీసుకోకతప్పదేమో.  



మరింత సమాచారం తెలుసుకోండి: