త‌మిళ‌నాడులో గెలుపు ఎవ‌రిని వ‌రించ‌నుందో న‌న్న ఆశ‌క్తి నెల‌కొంది. ఈ నెల 16 న జ‌ర‌గ‌బోయే తమిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ ప్ర‌చారం హోరెత్తుతున్న‌ది. రెండు ద్ర‌విడియ‌న్ పార్టీలు నువ్వానేనా అని ఢీ కొంటున్నాయి.  ఇప్ప‌టి వ‌ర‌కు ఓట‌ర్లు ఏదో ఒక ప‌క్షం వైపు గా మొగ్గిన‌ట్టు క‌నిపించ‌టం లేదు. అయితే బ‌హుళ ప‌క్ష పోటీల కార‌ణంగా రెండు ప్ర‌ధాన పార్టీల్లో దేనికీ నిర్ణ‌యాత్మ‌క మెజారిటీ రాక‌పోవ‌చ్చు. ఉధృతంగా సాగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌మిళ పురచ్చిత‌లైవి, సీఎం జ‌య‌ల‌లిత‌, డీఎంకే వృద్ధ‌నేత క‌రుణానిధి త‌మ వాక్చాతుర్య‌మంతా ఉప‌యోగించి ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌ల్లో పోటీ ప‌డుతున్నారు. డీఎంకే గ‌త నవంబ‌ర్ - డిసెంబ‌ర్ లో చెన్నైకి సంభ‌వించిన జ‌ల‌ప్ర‌ళ‌యాన్ని రాజ‌కీయంగా ఉప‌యోగించుకుంటూ, త‌మ‌కు అధికారమిస్తే పౌర స‌దుపాయాల‌పై  ప్రత్యేక దృష్టి పెడతామంటోంది. డీఎంకే కి సంబంధించి ఈ ఎన్నిక‌లు స్టాలిన్ రాజ‌కీయ వార‌సత్వాన్ని స్థిర‌ప‌ర‌చునున్నాయి. ముఖ్య‌మంత్రి జయ‌ల‌లిత త‌మ సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ఇత‌ర అనేక సాఫ‌ల్యాల‌ను గురించి గొప్ప‌లు చెప్పుకుంటుండ గా, డీఎంకే వృద్దనేత క‌రుణానిధి(92 సంవ‌త్స‌రాలు) రెండు వారాల్లో అధికారంలోకి వ‌స్తానంటున్నారు.

డీఎంకే ఎడీఎంకే  అవినీతి పాల‌న 


234 స్థానాల‌కు మొత్తం 4500 మంది అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. రెండు ద్ర‌విడ పార్టీల మ‌ధ్య పోటీ తీవ్రంగా ఉంది. అంతే అ స్ప‌ష్టంగా ఉంది. ఓట‌ర్ల‌ను త‌న వైపు తిప్పుకోవ‌టానికి ఎఐఎడిఎంకే అధినేత కొత్త వ్యూహాల‌ను ఇంకా ఆవిష్క‌రించ‌లేదు. మూడ‌వ శ‌క్తిగా ముందుకు వ‌చ్చిన సినీ న‌టుడు విజ‌య్ కాంత్ నాయ‌కత్వంలోని ప్రజా సంక్షేమ సంఘ‌ట‌న‌, పీఎంకే, బీజేపీ తదిత‌రుల పోటీతో అన్నీ బ‌హుముఖ పోటీలే. డీఎంకే ఎడీఎంకే  అవినీతి పాల‌న నుంచి త‌మిళ‌నాడు విముక్తి క‌లిగించాల‌ని ఆ పార్టీలు ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. పాల‌క ఎఐఎడీఎంకే 227 సీట్ల‌కు పోటీ చేస్తూ 7 సీట్ల‌ను అదీ త‌న గుర్తుపై చిన్న పార్టీల‌కు కేటాయిచింది. కాగా డీఎంకే 41 సీట్ల‌ను కాంగ్రెస్ పార్టీకి కేటాయించింది. డాక్ట‌ర్ రాందాస్( పీఎంకే) త‌న కుమారుడు డాక్ట‌ర్ అంబుమ‌ణి రాందాస్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించి ఒంట‌రిగా త‌న పార్టీని రంగంలో దింపాడు. బీజేపీ కూడా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా మిత్రులు దొర‌క్క ఒంటరి పోరాటం చేస్తోంది. కాగా, మూడ‌వ కూట‌మి లో విజ‌య‌కాంత్ డీఎండీకే, జికే వాసన్ త‌మిళ‌మానిల కాంగ్రెస్, వైకో ఎండీఎంకే, ద‌ళిత పార్టీ వీఎస్టీ, సిపిఐ, సీపీఎం భాగ‌స్వాములు  అయితే బ‌హుళ ప‌క్ష పోటీల కార‌ణంగా రెండు ప్ర‌ధాన పార్టీల్లో దేనికీ నిర్ణ‌యాత్మ‌క మెజారిటీ రాక‌పోనూవ‌చ్చు.

జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం పై అవినీతి


ఆర్థికాభివృద్దిని, ఎఫ్ డీఐలను విద్యుత్ మిగులు సాధించ‌టం త‌మ ప్ర‌భుత్వం ఘ‌న‌త‌గా ప్ర‌చారం చేస్తున్నాయి. ఉధృతంగా సాగుతోంది. అన్న పార్టీలు డీఎంకే  స‌హా జ‌య‌ల‌లిత ప్ర‌భుత్వం పై అవినీతి ఆరోప‌ణలు చేస్తున్నా, ఎఐఎండీఎంకే కు సంబంధించి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ల‌క్ష‌ణం స్ప‌ష్టంగా కనిపించ‌టం లేదు. తాజాగా జ‌య‌ల‌లిత త‌న మేనిఫెస్టో ను విడుద‌ల చేశారు. ఇందులో మొబైల్  ఫోన్ ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. గ‌త ఎన్నిక‌ల్లో గొర్రెలు, బ‌ర్రెలు, మిక్సీలు, గ్రైండ‌ర్లు,  ఫ్యాన్లు, ల్యాప్  టాప్ లు, పాఠ‌శాల విద్యార్థుల‌కు కిట్స్, సైకిళ్లు ఇలా అనేకం ఉచితంగా ఇచ్చిన జ‌య‌ల‌లిత‌... ఇప్పుడు మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తే మ‌రిన్ని ఉచితంగా అంద‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అన్ని పార్టీలూ మ‌ద్య‌పాన నిషేధం, రైతు-విద్యా రుణాల‌ను న‌మ్ముకోగా జ‌య‌ల‌లిత మాత్రం ఉచితాల‌నే నమ్ముకోవ‌డం గ‌మ‌నార్హం. చిన్న‌, స‌న్న కారు. మ‌ధ్య త‌ర‌గతి రైతు రుణాల మాఫీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 యూనిట్ల లోపు( 2 నెల‌ల‌కు) విద్యుత్ వినియోగ‌దారుల‌కు ఉచితంగా అంద‌జేస్తామ‌న్నారు. 


 
దీని ద్వారా  రాష్ట్ర వ్యాప్తంగా 78 ల‌క్ష‌ల కుటుంబాలు ల‌బ్ది పొందుతాయి. ఇక ఇప్ప‌టికే ప్ల‌స్ వ‌న్, ప్ల‌స్ టూ విద్యార్థుల‌కు  ఉచితంగా ఇస్తున్న ల్యాప్ టాప్ ల‌కు తోడు ఉచితంగా వైపై ఇంట‌ర్ నెట్ కూడా అంద‌జేస్తామ‌న్నారు. పేద, ధ‌నిక అన్న తేడా లేకుండా రేష‌న్ కార్డు  దారులంద‌రికీ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌కటించారు. ఇక నుంచి మోటార్ బైక్ , స్కూట‌ర్లు చేసే మ‌హిళ‌ల‌కు 50 శాతం రాయితీ క‌లిపిస్తామ‌న్నారు. సంక్రాంతి పండుగ స‌మ‌యంలో రేష‌న్ కార్డు దారులంద‌రికీ  రూ. 500 విలువ చేసే కో-ఆప్ టెక్స్ కూప‌న్లు అంద‌జేస్తామ‌న్నారు. దాంతో పండుగ కోసం కుటుంబం ఉచితంగా కొనుగోలు చేసుకోవ‌చ్చ‌ని ప్ర‌జ‌ల హ‌ర్ష‌ధ్వానాల మ‌ధ్య జ‌య ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల వ్య‌తిరేకిగా  త‌న‌పై ప‌డ్డ ముద్ర‌ను తొల‌గించుకునేందుకూ జ‌య ప్ర‌య‌త్నించారు. ఇక నుంచి ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంటి నిర్మాణం కోసం రూ. 40 ల‌క్ష‌ల రుణం అంద‌జేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటు ప్ర‌సూతి సెల‌వును 9 నెల‌ల‌కు మంజూరు చేస్తామ‌ని హమీ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చే జీవ భ‌త్యాల‌కు స‌మానంగా రాష్ట్ర  ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కూడా అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.


ఇలా అనేక ఉచితాల‌ను జ‌య‌ల‌లిత త‌న మేనిఫేస్టోలో పొందు ప‌రిచారు. త‌న పార్టీకి విజ‌యాన్ని చేకూర్చి పెట్టేలా ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించారు. అయితే డీఎంకే, కాంగ్రెస్ కూట‌మిని అవినీతి కూట‌మిగా విమ‌ర్శిస్తున్న జ‌య‌ల‌లిత‌, కరుణానిధి ప్రజా స్వామ్య విరుద్దంగా కుటుంబ పాల‌న నెల‌కొల్పాల‌ని చూస్తున్నాడ‌ని  నిందిస్తున్నారు. ఇక‌పోతే జ‌య‌ల‌లిత తో పొత్తును బీజేపీ నాయ‌కత్వం కోరుకున్నా ఆమె వారిని ద‌రికి రానివ్వ‌లేదు. కాగా రాష్ట్ర బీజేపీ జ‌య‌ల‌లిత పాల‌న‌ను  గ‌ట్టిగా  వ్య‌తిరేకిస్తోంది. ఈ మ‌ధ్య చెన్నై లో వ‌చ్చిన పార్టీ జాతీయాధ్య‌క్షుడు  అమిత్ షా  జ‌య‌ల‌లిత‌ది అత్యంత అవినీతి ప్ర‌భుత్వమ‌ని అన్నారు. 2జీ కుంభ‌కోణం బ‌ద్ద‌లైన చాలా రోజులకు, 2012 లో యూపీఏ రెండ‌వ ప్ర‌భుత్వంతో డీఎంకే సంబంధాలు తెంచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ - డీఎంకే ల పొత్తు అవ‌స‌రం కొద్దీ త‌ప్ప ఇష్ట పూర్వ‌కంగా జ‌రిగింది కాదు. కేవలం 41 సీట్ల కేటాయింపు ప‌ట్ల కాంగ్రెస్అసంతృప్తి తో ఉంది. ఆ సీట్ల‌ను వివిధ గ్రూపుల‌కు పంచ‌టం త‌ల‌నొప్పిగా మారింది. దివంగ‌త జేకే మూప‌నార్ కుమారుడు జీకే వాస‌న్ నిష్క్ర‌మించి త‌మిళ‌మానిల కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నాక కాంగ్రెస్ కు నాయ‌కులు త‌ప్ప జనం లేర‌న్న క‌రుణానిధి వ్యాఖ్య ఆ పార్టీ నాయ‌కుల‌ను బాధించింది.


పొత్తు పెట్టుకోకపోతే అడ్రస్ గల్లంతు అవుతుందేమోనన్న భయంతో అవమానాన్ని దిగమింగారు. అయితే ఎఐఎడి ఎంకెకు చరిత్రలో దారుణమైన ఓటమి తప్పదని పిసిసి అధ్యక్షుడు ఇవికెఎస్ ఇలాంగోవన్ జోస్యం చెబుతున్నారు. సంపూర్ణ మ‌ధ్య పాన నిషేధం ఇప్పుడు అన్ని పార్టీల నినాదం కావ‌డ‌టం విశేషం. పేద‌ల సంక్షేమం, ముఖ్యంగా మ‌హిళ‌ల సంక్షేమం దృష్టా మూడ‌వ సంఘ‌ట‌న పార్టీలు ముందుగా ఈ డిమాండ్ చేశాయి. రాజ‌కీయ చాణ‌క్యుడైన క‌రుణానిధి ఇందులో విజ‌యావ‌కాశాన్ని చూశాడు. అధికారంలో ఉన్న‌ప్పుడు  ఏమీ చేశార‌నే  దానితో నిమిత్తం లేకుండా  త‌మ‌కు అధికార‌మిస్తే, తొలి సంత‌కం మ‌ద్య‌నిషేదం పైలు పైనే అని ప్ర‌క‌టించారు. ఒక‌రిపై ఒక‌రు నినాధాల‌తో ప్ర‌చారం లో ముందుకుపోతున్నా, త‌మిళ ఓటర్లు ఏదో ఒక పక్షంవైపు మొగ్గినట్లు ఇప్పటివరకూ కనిపించటం లేదు. మ‌రి విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో చూడాలి...!


మరింత సమాచారం తెలుసుకోండి: