చంద్రబాబు అంటేనే హైటెక్ పదానికి ప్రతిరూపం అని టీడీపీ నాయకులు చెప్పుకుంటారు. ఉమ్మడి ఏపీ కాలగర్బంలో కలసిపోయినా.. ఇప్పటికీ ప్రతి మీటింగ్ లోనూ హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు కూడా చెప్పుకుంటారు. ప్రత్యేకించి హైటెక్ సిటీ రికార్డు సమయంలో కట్టించి హైదరాబాద్ ను ఐటీ సిటీగా తీర్చిదిద్దిన విషయంలో చంద్రబాబు కృషిని ఆయన వ్యతిరేకులు కూడా కాదనలేరు.

అంతటి ఘన చరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు ఏపీని కూడా ఐటీ క్యాపిటల్ గా మార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విశాఖ, తిరుపతి, అమరావతిలను ఐటీ సిటీలుగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ద బెస్ట్ వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరిపే ప్రక్రియను వెంటనే ఆరంభించాలని ఆయన అధికారులకు సూచించారు. 

ఐటీ సిటీలుగా విశాఖ, తిరుపతి, అమరావతి.. 


కేవలం పెద్ద పెద్ద కంపెనీలనే కాకుండా ఇన్నోవేటివ్ థాట్స్ తో ముందుకొచ్చే చిన్నతరహా ఐటీ కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు అంటున్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన ఐటీ ప్రమోషన్స్, ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్, ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, ఇ-గవర్నెన్స్, మీసేవ, ఇ-ప్రగతి పురోగతిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

విశాఖనగరంలో మిలీనియం టవర్స్ నిర్మాణ పనుల్లో పురోగతి గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అంతులేని జాప్యాన్ని సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. అమరావతి, తిరుపతిలోనూ మిలీనియం టవర్స్ నిర్మాణాలు నిర్మించేందుకు బాబు ప్లాన్ చేస్తున్నారు. పెట్టుబడుల కోణంలోనే కాకుండా పరిపాలనలోనూ హైటెక్ ముద్ర చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. 133 ప్రభుత్వ విభాగాలలో అన్నిరకాల సేవలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: