దేశంలో కొంతమంది ఉన్నతమైన పొజీషన్లో ఉన్నా కూడా వారు చేసే కొన్ని చెత్త పనుల వల్ల సోషల్ మీడియాలో సిగ్గు పోగొట్టుకుంటారు. ఇలాంటి సంఘటనల్లో రాజకీయ నాయకులు,సినీ స్టార్లు, ఉన్నతాధికారులు ఇలా చాలా మంది ఉన్నారు. తాజాగా చత్తీస్గఢ్ ఐఏఎస్ అధికారి జగదీష్ సోంకర్ ఓ ఆస్పత్రికి తనిఖీకి వెళ్లినపుడు చేసిన చర్య వివాదాస్పదంగా మారింది. ఛత్తీస్‌గఢ్ ఐఎఎస్ అధికారి జగదీష్ సోంకర్ రాయ్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో ఓ పేషెంట్ ని పరామర్శించడానికి వెళ్లారు. ఈయన ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు డాక్టర్ కూడా.

ప్రస్తుతం ఐఏఎస్ హోదాలో కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. ఈయన గారు ఓ హాస్పిటల్ లో మహిళా రోగితో మాట్లాడుతూ బెడ్‌పై కాలు పెట్టి నిలుచున్నారు. ఈ దృశ్యాన్ని ఓ మీడియా ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించడమేకాకుండా పత్రికలో ప్రచురించాడు. అంతే కాదు ఈ ఫోటో కాస్త పత్రికల్లోనూ, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది. దీంతో ఈ అధికారి ఓ డాక్టర్ అయి ఉండి కూడా ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు.  దీంతో ఐఎఎస్ అధికారి జగదీష్ సోంకర్ నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు.

తను కావాలని చేయలేదని, తన చర్య ఎవరినైనా బాధించివుంటే క్షమించాలని కోరారు. 'నేను అనాలోచితంగా చేసిన చర్యకు బాధ్యతగా క్షమాపణలు చెబుతున్నాను. లాంటి ప్రవర్తన వల్ల సివిల్ సర్వీసు ప్రతిష్టకు భంగం కలుగుతుందని అర్థం చేసుకోగలను. అధికారులందరికీ క్షమాపణలు చెబుతున్నాను'' అంటూ ఫేస్‌బుక్‌లో తన కామెంట్స్ పోస్ట్ చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: