ఈ మద్య కాలంలో రైలు దోపిడీలు బాగా పెరిగిపోయాయి. ఒకప్పుడు రైలు ప్రయాణాలు చేయాలంటే చాలా భయం భయంగా చేసేవారు ఎందుకంటే నిర్జీవ ప్రదేశాల్లో దోపిడి దొంగలు రైళ్లను ఆపి అందినంత దోచుకొని వెళ్లే వారు.  అయితే ఈ మద్య రైళ్లలో సెక్యూరిటీ చాలా వరకు మెరుగు చేశారు. కాకపోతే ఇలాంటి రైలు దోపిడీలు ఉత్తరాధి ప్రాంతాల్లో బాగా జరుగుతుంటాయి.

తాజాగా సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ లో దోపిడి దొంగలు హల్ చల్ చేశారు. రైలును ఆపి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి బంగారం,నగదు దోచుకు వెళ్లారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారు జామున వరంగల్‌జిల్లా గుండ్రాతిమడుగు వద్ద జరిగింది.

దాదాపు పది మంది వరకు ముసుగు వేసుకొని యస్వంత్‌పూర్-పాట్నా వెళుతున్న సంఘమిత్రా ఎక్స్‌ప్రెస్ రైల్‌ను డోర్నకల్-మహబూబాబాద్ స్టేషన్ల మధ్య అలారం చైన్ లాగి ఆపి ప్రయాణికుల నుంచి భారీగా బంగారం లాక్కెళ్లారు. ఈ దోపిడీ ఎస్2, ఎస్ 12 బోగిల్లో జరిగింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: