తెలుగు రాష్ట్రాలు రెండు గా విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్ది కోసం అధికార ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ పరంగా ఎన్నో  అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఏ చౌదరి ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధింది వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.
ticon1
 ఈ సందర్భంగా కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో నిర్వహించిన టైకాన్-2016 సదస్సు ప్రవాసాంధ్రులను ఏకతాటిపైకి తెచ్చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏపీ బూత్ వద్దకు వందలాది మంది టెక్కీలు..ఆంధ్రప్రదేశ్ అభిమానులు స్వచ్చందంగా తరలి వచ్చారు.  ఇక సాంకేతిక ఆవిష్కరణలు, ఎంటర్ ప్రెన్యూర్షిప్ లకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్దదైన టైకాన్-2016కు భారీ స్పందన రావడం చాలా పెద్దవిషయంగానే చెప్పవొచ్చు. ఏపీ ముఖ్యమంత్రి నారా చాంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని నవ్యాంధ్రప్రదేశ్ ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ticon3
ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జేఏ చౌదరి ఏపీ స్మార్టు స్టేట్ కాన్సెప్టును ఇక్కడ ఆవిష్కరింపజేశారు. స్మార్టు విలేజెస్, స్మార్టు టౌన్సు, స్మార్టు సిటీస్ వంటి కాన్సెప్టులను.. అధునాత డిజిటల్ ఇనిసియేషన్సును ఆయన టైకాన్ లో ఏపీ తరఫున అందరికి చేరేలా చేశారు. ఏపీలో సాంకేతిక పరంగా తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులకు ఏపీలో ప్రవేశపెట్టిన, ప్రవేశపెట్టనున్న సాంకేతిక మార్పులకు టైకాన్ లో అభినందనల వర్షం కురిసింది.
ticon4
టైకాన్ సదస్సులో ఏపీ భాగస్వామ్యం పట్లా ఎన్నారైల్లో సంతోషం కనిపించింది.  ఈ సందర్భంగా వజ్ర సాఫ్టు సంస్థ సీఈఓ కామేశ్వర్ ఏరంకిమాట్లాడుతూ ఏపీ సాంకేతికాభివృద్ధిలో భాగస్వాములు కావడం ఎవరికైనా గర్వకారణమని అన్నారు.  టైకాన్ ఏపీ కారిడార్ లో అమెరికాలోనివి, ఏపీ నుంచి వచ్చిన సంస్థలు పాల్గొన్నాయి. సాప్, క్వాల్ కామ్, ఓర్జోటా, ఫ్లూయెంట్ గ్రిడ్, ఎంట్యూటీ, ఇండోనెక్సు హెల్తు తదితర సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: