ఆంధ్రా రాజకీయ కుమ్ములాటల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తమ పార్టీ ఎమ్యెల్యేలను వివిధ మార్గాల్లో ప్రలోభాలకు గురి చేసి టీడీపీలో చేర్చుకుంటున్నారని కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం మొదలైన ఈ ఆపరేషన్ ఆకర్ష కొన్ని రోజులుగా స్పీడ్ అందుకుంది. 

మొత్తం గత ఎన్నికల్లో వైసీపీ తరపున 67 మంది గెలిస్తే..అందులో 17 మంది వరకూ ఇప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్షకు లొంగిపోయారు. ఈ పరిస్థితి చూస్తే జగన్ పార్టీని సాధ్యమైనంతగా ఖాళీ చేసేందుకు టీడీపీ అన్నిప్రయత్నాలు చేస్తోందన్న మాట అక్షరాలా నిజం. స్పీకర్ చేతిలో అసెంబ్లీకి చెందిన సర్వాధికారాలు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీలు ఇలాంటి ఆగడాలకు పాల్పడుతూనే ఉంటాయి.  

సుప్రీంకోర్టులో ఫిరాయంపుల బంతి..


అందుకే ఈ ఫిరాయింపులను నిరోధించుకుని పార్టీని కాపాడుకునేందుకు జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ ప్రలోభాలపై జాతీయ స్థాయిలో ప్రచారం చేశారు. ఆ మధ్య ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నాయకులకు తమ గోడు వినిపించుకున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ రాజకీయాల్లో ఫిరాయింపుదారులకు తగిలిన షాక్ జగన్ పార్టీలో ఆశలు రేపింది. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు జగన్ పార్టీలో ఉత్సాహం నింపింది. 

అందుకే.. ఉత్తరాఖండ్ కంటే ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందంటూ వైసీపీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ మేరకు ఒక పిటీషన్ దాఖలు చేసింది. టీడీపీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ స్పీకర్ కు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవటం లేదని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో స్పీకర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేరుస్తూ పిటీషన్ దాఖలు చేశారు.

సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను స్వీకరించి విచారణ ప్రారంభిస్తే ఏపీలో పొటిలిటకల్ సునామీరావడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే దుస్సాంప్రదాయానికి కేవలం సుప్రీంకోర్టే అడ్డుకట్ట వేయగలగుతుందనడంలో సందేహం లేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: