భారత్ లో 15లక్షల మించి వార్షిక ఆదాయం ఉన్నవారికి వచ్చే బడ్జెట్లో పన్నుపోటు పెరగవచ్చు. 15లక్షల ఆదాయం మించినవారిని అందరిని సూపర్‌రిచ్‌ తరగతిలో చేర్చే అవకాశం ఉందని, వచ్చే నెల బడ్జెట్లో ఈ ప్రతిపాదనపై కసరత్తు జరుగుతున్నట్లు వినికిడి. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఈ పద్ధతిని ఇండియాలో ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ సి రంగరాజన్‌ అధిక ఆదాయం కలవారి మీద అధికంగా పన్నులు వేయాలని ఇటీవల సూచించారు. అయితే ఎంత ఆదాయం దీనికి ప్రాతిపదికగా తీసుకోవాలో చెప్పలేదు. ప్రభుత్వం సూపర్‌రిచ్‌ను గుర్తించటానికి కసరత్తు ప్రారంభిస్తే వారు తమ సంపదను ప్రభుత్వం గుర్తించలేని విధంగా వివిధ దేశాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి బదులు అధిక ఆదా యం వచ్చే వారు చెల్లించే ఆదాయపు పన్ను మీద సర్‌ఛార్జీ విధించటం మంచిదనే సూచనలు వినిపిస్తున్నాయి. 2009-10కి ముందు ఈ సర్‌ఛార్జీ పద్ధతి ఉండేది. దీని ద్వారా ప్రభుత్వా నికి ఏటా 10వేల కోట్ల రూపాయలకు పైగాఆదాయం వచ్చేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: