ఆంధ్రప్రదేశ్ కు కొత్త రాజధానిని గుంటూరు సమీపంలో నిర్మించాలని నిర్ణయించినప్పుడు పేరుపై అనేక ప్రతిపాదనలు వచ్చాయి. మొదట్లో ఏపీ రాజధానికి ఎన్టీఆర్ పేరు పెడతారని టాక్ వచ్చింది. రాజధాని ప్రాంతంలోని బిల్డింగులను ఆకాశం నుంచి చూస్తే ఎన్టీఆర్ అనే అక్షరాలు వచ్చేలా రూపొందించాలని కూడా భావించినట్టు అప్పట్లో అనేక కథనాలు వెలువడ్డాయి.

ఏపీ రాజధాని కోసం అనేక పేర్లు పరిశీలించిన తర్వాత ఫైనల్ గా అమరావతి పేరును ఓకే చేశారు. ఈ పేరు చాలా బావుండటం, చారిత్రక నేపథ్యం ఉండటంతో అంతా ఓకే చేశారు. ఎక్కడా విమర్శలు కూడా రాలేదు. కానీ ఈ పేరును ప్రతిపాదించిందెవరు.. ఈ విషయాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఏపీ రాజధానికిపేరును ఈనాడు ప్రధాన సంపాదకుడు రామోజీరావు సూచించారని చెప్పారు. 

అమరావతి పేరు రామోజీ ప్రతిపాదించారు - బాబు


ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు రచించిన అమరావతి ప్రభువు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అన్న పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించిన సమయంలో సీఎం ఈ విషయాన్ని ప్రస్తావించారు. రామోజీరావు అమరావతి పేరు సూచించడమేకాక, దాని వెనుక ఉన్న చరిత్ర తదితర వివరాలు తనకు పంపించారని చంద్రబాబు  వెల్లడించారు.

అప్పట్లో రామోజీరావు రాజధానికి అమరావతి పేరును సూచిస్తూ ఈనాడు పత్రికలో ఓ వ్యాసం కూడా రాశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అమరావతిని పది అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిర్మిస్తామన్నారు. చరిత్ర పుటల్లో... శాతవాహనుల కాలంలోనే అమరావతి విరాజిల్లిందని, అది పెద్ద వాణిజ్య కేంద్రంగా ఉందని చంద్రబాబుగుర్తు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: