ప్రమాదాలు అనేవి చెప్పిరావు..అలాగే ఆ ప్రమాదాలు ఎక్కడ నుంచి వస్తాయో అస్సలు తెలియదు. అది భూమిపై కావచ్చు..ఆకాశంలో కావచ్చు లేదా నీటిపై కావచ్చు. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రమాదాలు జరిగిపోతుంటాయి. తాజాగా  పోర్చుగల్ లోని కోయింబ్రా నుంచి ఫ్రాన్స్ కి వెళ్తున్న ఓ తేలికపాటి విమానం ఆకాశంలో అడ్డుగా వచ్చిన రాబందును 'ఢీ' కొట్టింది. దీంతో అదుపు తప్పిన విమానం స్పెయిన్ కు ఉత్తర ప్రాంతంలో ఆర్బిజు అనే గ్రామంలో రెండు ఇళ్ల నడుమ కూలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ సహా ముగ్గురు మరణించారు.

ఈ దుర్ఘటన స్పెయిన్లోని ఉత్తరప్రాంతంలో జరిగింది.విమానం కుప్పకూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తగ్గిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. విమాన ప్రమాదాన్ని చూసిన అక్కడి స్థానికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.

ఆ తెలికపాటి విమానాన్ని రాబందు 'ఢీ'కొట్టడంతో అదుపుతప్పి ఆర్బిజు అనే గ్రామంలో రెండు ఇళ్ల మధ్య ఉన్న స్థలంపై పడటంతో అందరూ షాక్ కి గురై  గ్రామస్తులు భయంతో వణికిపోయారు.ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: