తెలంగాణ రాష్ట్రం ఫై ఢిల్లీ లో సానుకూలత వస్తుందన్న నేపథ్యంలో ఇక సీమాంధ్ర నేతలు కూడా రంగంలోకి దిగారు, అధిష్ఠానంపై ఒత్తిడి పెంచేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని, హోంమంత్రి, ఆజాద్‌, వయలార్‌ రవిని కలిసి రాష్ట్రం సమైక్యంగానే ఉంచాలని కోరనున్నారు. అటు తెలుగుదేశం, వైకాపాలో కూడా సమైక్యవేడి రగులుతోంది. సమైక్యవాదంతో కాంగ్రెస్‌ నేతలు హడావిడి చేస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా రంగంలో దిగారు. ప్రస్తుతం తెలంగాణకే పరిమితమయిన ఉద్యమానికి పోటీగా సమైక్యాంధ్ర ఉద్యమం రగలనుంది. రాష్ట్ర విభజనపై కేంద్రం కసరత్తు చేస్తోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తమయిన సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగారు. కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు 8 మంది మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రం ప్రకటించిన వెంటనే తామంతా సామూహికంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి, ప్రజలతో కలసి ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రజలు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, సీనియర్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వంటి నేతలు కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని, హైదరాబాద్‌, రంగా రెడ్డి జిల్లా నేతలు కూడా రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని అధిష్ఠానానికి స్పష్టం చేయనున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: