జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని సిఫార్సు చేసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - జేఎంఎం కూటమిలో తలెత్తిన అభిప్రాయబేధాల కారణంగా ప్రభుత్వం మెజారిటీ కోల్పోయింది. జేఎంఎం నేతలు బీజేపీకి మద్దతు ఉపసంహరించారు. దీంతో ముఖ్యమంత్రి అర్జున్ ముండా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కానీ, కూటమిగాని ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. దీంతో గవర్నర్ కేంద్రానికి రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ నివేదిక ఇచ్చారు. గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించాలంటూ సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రపతి ప్రణబ్ ఈ సిఫార్స్ ను ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి పాలన అమల్లోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: