ఏపీ సచివాలయంతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ రాజధాని అమరావతికి తరలిపోతున్నాయి. ఈ తరలింపు శరవేగంగా సాగిపోతోంది. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లక తప్పదని చంద్రబాబు తేల్చి చెప్పారు. జూన్ 27 నాటికి ఏపీ రాజధాని నుంచి పాలన సాగాలని చంద్రబాబు ఖరాఖండీగా చెప్పేశారు. సో..ఇష్టం ఉన్నా లేకపోయినా తరలిపోక తప్పదని ఉద్యోగులు కూడా డిసైడయ్యారు.

కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో అద్దెలు విపరీతంగా ఉన్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లో సైతం లేని అద్దెలు వెలగపూడి ప్రాంతంలో చెబుతున్నారని వాపోతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కూడా గతంలో ఎన్నోసార్లు విజయవాడ, గుంటూరు వాసులకు విజ్ఞప్తి చేశారు. అద్దెలు విపరీతంగా పెంచితే అభివృద్ధి త్వరగా జరగదని చెప్పి చూశారు. 

అద్దెలు పెంచితే.. బ్రహ్మాస్త్రం.. 


కానీ పరిస్థితిలో మార్పు ఉన్నట్టు లేదు. అందుకే ఈసారి చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇచ్చేశారు. విజయవాడ, గుంటూరులలో ఎవరైన అద్దెలు విపరీతంగా పెంచితే రెంట్  కంట్రోల్ యాక్ట్ అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జూన్ 27లోగా హెచ్ఓడీ కార్యాలయాలన్నీ రాజధానికి తరలిరావాల్సిందేనని స్పష్టం చేశారు. 

గుంటూరు, విజయవాడలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని, జూన్ 27తర్వాత పాలనను ఇక్కడి నుంచే కొనసాగించాలని స్పష్టం చేశారు. గృహనిర్మాణశాఖపై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించిన సీఎం తక్షణమే లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖపై ప్రతి వారం తాను స్వయంగా సమీక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: