ఓటుకు నోటు కేసు - ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవన్నీ గత ఏడాది విశేషాలు. గడిచిపోయిన కాలంలో అందరూ మరచిపోయిన విషయాల మీద ఇప్పటికీ శపధాలు చేస్తూ ఎదో పీకేస్తా అనేవాడిని ఏమంటారు ? రేవంత్ రెడ్డి అంటారు. అవును అందరూ మర్చిపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి ఇప్పుడు డాంభీకాలు పోతున్నాడు ఈయన. తెలంగాణా లో టీడీపీ ఖాళీ అయిపొయింది. ముగ్గురంటే ముగ్గురే ఆ టీడీపీ పడవ లో ముగ్గురంటే ముగ్గురు మాత్రమే మిగలగా అందులో ముగ్గురు ఓటుకు నోటు కేసులో నిందితులు. పడవలో ఎవ్వరూ లేకపోయినా ఆ పడవ కి తానే కెప్టెన్ అని ఫీల్ అవుతున్న రేవంత్ రెడ్డి చేసే తాజా ఆరోపణలు చాలా హాస్యాస్పదం గా అనిపిస్తున్నాయి.

 

 

రేవంత్ రెడ్డి మాటలు తెరాస వారి సంగతి పక్కన పెడితే తెలంగాణా టీడీపీ లో కూడా ఎవ్వరూ పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయం. ఉస్మానియా లో ప్లాన్ చేసిన జన జాతర విషయం లో రేవంత్ కి గట్టి షాక్ తగిలింది. అవుట్ డేటెడ్ రాజకీయ వేత్త గా రేవంత్ రెడ్డి కి ఇప్పుడు పెద్ద పేరు ఒచ్చేసింది. ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో చాలా సీరియస్ సాక్షాధారాలు తన దగ్గర ఉన్నాయి అని రేవంత్ చెప్పడం నవ్వొచ్చే విషయం. అగ్రెసివ్ గా మాట్లాడితే సరిపోతుంది అనుకునే రేవంత్ రెడ్డి తగిన ఆధారాలు లేకుండా మాట్లాడ్డం ఫూలిష్ గా అనిపిస్తుంది. తాను స్వయంగా ఓటుకు నోటు లో అడ్డంగా బుక్ అయిపోయిన ఈ మహానుభావుడు తన కేసుల సంగతి వదిలేసి అవుట్ డేట్ అయిపోయిన ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడ్డం ఏంటో. అసలు ఎవరైనా పట్టించుకుంటారా ?


మరింత సమాచారం తెలుసుకోండి: