తెలంగాణ ఏర్పాటు ఖాయమని ప్రచారం జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణపై కేంద్ర ప్రకటన చేసేందుకు మరో వారం రోజులు గడువు ఉన్న నేపథ్యంలో... కేంద్ర బలగాలు వస్తున్నాయన్న ప్రచారంతో మరింత ఉత్కంఠ రేపుతోంది. అసలు కేంద్ర పారామిలటరీ బలగాలు ఎందుకు వస్తున్నాయి. కేంద్రం నుండి తెలంగాణకు ప్రకటన వస్తే సీమాంధ్రలో ఆందోళనలు ఉదృతం అవుతాయి. అటు సమైక్య రాష్ట్రానికి అనుకూలమని ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు ఉద్యమబాట పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం దాదాపు 360 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపనుందని ప్రచారం జరుగుతోంది. అంటే దాదాపు 50వేల మంది సిబ్బందిని పంపుతున్నట్టు సమాచారం. అంటే 2009 డిసెంబర్ లో తెలంగాణపై ప్రకటన చేసిన సమయంలో తలెత్తిన ఆందోళనలను అదుపుచేసేందుకు అప్పట్లో కేంద్రం 95 కంపెనీల పారా మిలటరీ బలగాలను పంపింది. కానీ ఇప్పుడు ఏకంగా మూడింతలు అధిక బలగాలను ఎందుకు పంపుతోందన్నది చర్చనీయాంశమైంది. అయితే కేంద్రం చేయబోయే ప్రకటన తర్వాత రాష్ట్రంలో తలెత్తే పరిస్థితులను అంచనా వేసిన కేంద్ర హోంశాఖ... ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ భారీ కసరత్తు చేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: