మనం పాత సినిమాల్లో చూస్తుంటా..ముఖ్యంగా కొందరు మునులకు ఆగ్రహం తెప్పిస్తే నువ్వు జీవం లేని శిలగా మారిపో అని శపిస్తుంటారు. ఇక విఠలాచార్య సినిమాల్లో అయితే మంత్రగాడు తన మంత్రదండంతో శపిస్తే రాయిగా మారిపోవడం ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ ఇలా రాయిగా మారే మనిషిని మనం నిజజీవితంలో ఎవరైనా చూశారా అంటే సమాధానమే రాదు..ఎందుకంటే అలా జరిగే చాన్సే లేదు. కానీ పదకొండు సంవత్సరాల బాలుడు విగ్రహంలా మారుతున్నాడు. పుట్టుకతోనే వచ్చిన హార్లీక్వీన్ ఇచ్ఛియోసిస్(పొలుసులుగా ఏర్పడే చర్మవ్యాధి) వల్ల ఈ బాలుడు చూసే వారికి అచ్చం రాయిలా మారిపోయినవాడిలా కనిపిస్తున్నాడు.

దీంతో బాలుడు బయటకు వెళ్లలేకపోతున్నాడు. నలుగురితో మాట్లాడలేకపోతున్నాడు. పాఠశాలకు కూడా వెళ్లడం లేదు. పదకొండేళ్ల నుంచి నాలుగు గోడల మధ్యే కాలం వెల్లదీస్తున్నాడు.  నేపాల్‌కు చెందిన నార్ కుమారి, నంద దంపతులకు రమేశ్ సంతానం. రమేశ్‌కు పుట్టుకతోనే జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబధిత వ్యాధి వచ్చింది. ఫంగల్ ఇన్‌ఫెక్షన్ అని స్థానికులు చెప్పారు.

రోజు రోజుకు చర్మం గట్టిగా మారి పొలుసులు ఏర్పడటంతో వైద్యులను సంప్రదించారు. ఖాట్మండ్ మెడికల్ కళాశాల వైద్యులు రమేశ్‌కు చికిత్స అందిస్తున్నారు.శరీరంపై ఉన్న నల్లటి చర్మాన్ని తొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నామని తెలిపారు. బాలుడు ఎముకలు, కండరాలు బలహీనంగా ఉన్నందుకు ఫిజియోథెరపీ చేయాలని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: