సినిమా హీరోయిన్ అనగానే నాలుగు గుడ్డ పీలికలు ఒంటి చుట్టుకుని అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంటుందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. దురదృష్టవశాత్తూ చాలామంది అలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తుంటారు కూడా. గ్లామర్ హీరోయిన్ గా పేరొస్తే..ఇక తమకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదనుకుంటారు. కానీ అందరు హీరోయిన్లూ ఒకలా ఉండరు కదా.

అలాంటి వారిలో తమిళ హీరోయిన్ ఆనంది ఒకరు. ఈమె గతంలో త్రియ లేదా నయనతార, పొరియాళన్, చండీవీరన్  అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.  చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాత్రం చాలా ఇబ్బందులు పడిందట. అరకొర దుస్తులు ధరించాలంటూ తనపై కొందరు దర్శకులు ఒత్తిడి తెచ్చారట. 


తాజాగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో రొమాన్స్ చేసిన ఆనంది... ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాత చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది. మొదట్లో.. కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారట. అప్పుడు తాను చాలా అసౌకర్యానికి గురయ్యిందట. 

చివరకు తాను అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాల్సి వచ్చిందట. అప్పుడు గానీ తనపై ఒత్తిళ్లు తగ్గలేదట. తాను ఇప్పటికే ఈ మాటకే కట్టుబడి ఉందట. గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవంటున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: