ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. ఉద్యోగులను ఏపీ, తెలంగాణాలకు పంచాల్సి వచ్చింది. ఈ పంపకాల్లో కొన్ని విచిత్రాలు కూడా జరిగాయి. తెలంగాణలో పుట్టి  పెరిగిన కొందరు ఉద్యోగులు కూడా ఏపీ కోటా కింద పంపకం చేయాల్సి వచ్చింది.

పోనీలే పేరు ఏదైతే ఏంటి.. హైదరాబాద్ లోనే పని చేస్తాం కదా అనుకోవడానికి వీలు లేదు. ఈనెల 27 నాటికి అమరావతి వచ్చేయాలంటున్న ఏపీ సీఎం చంద్రబాబు. దీంతో తెలంగాణలోనే పుట్టి పెరిగిన ఈ తెలంగాణ ఉద్యోగులు తమను ఏపీ నుంచి తెలంగాణకు మార్చాలని విజ్ఞప్తి చేస్తోంది.


కొన్నిరోజులుగా వారు సచివాలయంలో నిరసనలు తెలుపుతున్నారు. ఎట్టకేలకు కేసీఆర్ వీరి మొర ఆలకించారు. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న పలువురు నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు, లిఫ్ట్‌ ఆపరేటర్లు, రికార్డు అసిస్టెంట్లు, తపాలా సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం బాసటగా నిలిచింది.

వారిని తమ రాష్ట్రంలోకి తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆర్ధిక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. వీరందరి నియామకాల సర్దుబాటు చేసేందుకు వీలుగా దస్త్రాన్ని సీఎం వద్దకు పంపించారు. ఆయన అనుమతి పొందిన వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. కమలనాథన్‌ కమిటీ కేటాయింపుల ప్రక్రియలో భాగంగా తెలంగాణకు చెందిన దాదాపు వెయ్యి మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు, అదే కేటగిరిలో ఇతర ఉద్యోగులు ఏపీకి వెళ్లారు.



మరింత సమాచారం తెలుసుకోండి: