ఆంధ్రాకు అన్నపూర్ణగా పేరు.. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసే రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. ఈ రబీ సీజన్‌లో వరిలో అధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా దేశంలోనే  రెండోస్థానం పొందిందట. వరి ఉత్పత్తిలో పంజాబ్, తమిళనాడులకు మొదటి రెండు స్థానాలు రాగా  ఏపీ మూడో స్థానంలో నిలిచిందట. మరి ఏపీలో ఏ జిల్లాలు వరి సాగులో ముందున్నాయి. ఏ జిల్లా వెనుకబడి ఉంది. ఈ వివరాలు పరిశీలిద్దాం.. 

ఈ ఏడాది ఖరీఫ్, రబీ కలిపి సరాసరిగా హెక్టార్‌కు 5వేల 56 కిలోల దిగుబడి వచ్చిందట. దిగుబడిలో నెల్లూరు, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. నెల్లూరు జిల్లాలో హెక్టారుకు వరి దిగుబడి 6 వేల 146 కిలోలు.  పశ్చిమ , తూర్పు గోదావరి జిల్లాల్లో 5వేల 903, 5వేల 566 కిలోల దిగుబడి వచ్చాయి. 


ఇక విశాఖ జిల్లా ఆంధ్రాలోనే అతి తక్కువగా వరి పండించిందట. కరువు నివారణపై సీఎం నిర్వహించన సమీక్ష సందర్భంగా ఈ వివరాలను అధికారులు వివరించారు. వరి కాకుండా మిగిలిన పంటల విషయానికి వస్తే.. అరటి, బొప్పాయి, కొబ్బరి, ఆయిల్ పామ్, మిరప ఉత్పత్తిలో దేశంలోనే ఏపీది ఫస్ట్ ప్లేస్. ఈ ఫలితాలతో బాబు ఖుషీ అయ్యారట. 

పత్తి ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో నిలిచిందట. కందుల ఉత్పత్తిలో 17వ స్థానం, మినుముల ఉత్పత్తిలో రెండో స్థానం, వేరుశనగ ఉత్పత్తిలో 15వ స్థానంలో ఏపీ వచ్చిందట. కరవును పారదోలేందుకు ఏపీ 1200 కోట్లతో ప్రణాళికలు రూపొందిస్తోందని చంద్రబాబు ఈ సమీక్ష సంద్భంగా చెప్పారు. ఈ సొమ్మంతా ఐదు జిల్లాల్లో విడతల వారీగా ఖర్చు చేస్తారట.



మరింత సమాచారం తెలుసుకోండి: