భారత దేశంలో సాంకేతిక రంగంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ అగ్ర రాజ్యాలతో సమానంగా ముందుకు వెళ్తుతుంది. ముఖ్యంగా భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) మరో రికార్డు సృష్టిస్తుంది.  ఈ నెల 22న ఉదయం 9.25 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ-34 ఉపగ్రహ వాహకనౌకకు కౌంట్‌డౌన్ సమయాన్ని కొంత మార్పు చేశారు. సాయంత్రం 6 గంటలకు సమావేశాన్ని పూర్తి చేసి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సోమవారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభించి 39.30 గంటల అనంతరం ప్రయోగించాలని ముందుగా అనుకున్నారు. కొంత సమయాభావం వల్ల 48 గంటలకు కౌంట్‌డౌన్ సమయాన్ని పెంచారు.
పీఎస్‌ఎల్‌వీ సీ-34కు నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం
ల్యాబ్ చైర్మన్ పి.కున్హికృష్ణన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు.  గతంలో అమెరికా ఒకే సారి 26 ఉపగ్రహాలను ప్రయోగించి మొదటిస్థానంలో నిలువగా, 22 ఉపగ్రహాల ప్రయోగంతో రష్యా రెండోస్థానంలో ఉంది. ఇస్రో ప్రయోగం విజయవంతమైతే ఈ జాబితాల్లో భారత్ మూడోస్థానంలో నిలువనుంది. పీఎస్‌ఎల్వీ సీ-34 ద్వారా మూడు స్వదేశీ, 17 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. భూమికి అతిదగ్గరగా ఉన్న సూర్యావర్తన ధృవకక్ష్యలోకి (సన్ సింక్రోనస్ ఆర్బిట్) ఈ ఉపగ్రహాలను ప్రవేశపెడుతారు.

ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన కార్టోశాట్ 2సీ, సత్యాభామ శాట్ (చెన్నైకి చెందిన సత్యభామ డీమ్డ్ వర్సిటీ విద్యార్థులు దీనిని రూపొందించారు), స్వయంశాట్ (పుణె ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు దీనిని రూపొందించారు), లపాస్ ఏ3 (ఇండోనేషియా), బిరోస్ (జర్మనీ), ఎం3శాట్, జీహెచ్‌జీ శాట్ (కెనడా), స్కైశాట్ జెస్ 2-1 (యూఎస్‌ఏ), డౌప్ శాట్ (యూఎస్‌ఏ-ఇందులో మళ్లీ మరో 12 చిన్న చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి). 

నేడు పిఎస్‌ఎల్‌వి- సి34 కౌంట్‌డౌన్‌

ఇప్పటి వరకు భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలు ఇవే!


పిఎస్‌ఎల్‌వి-సి34 ద్వారా మన దేశానికి చెందిన 560కిలోల కాటోశాట్‌-2 (భూ పరిశీలనకు ఐదేళ్లపాటు ఉపయోగపడుతుంది) రోదసీకి చేరనుంది. తమిళనాడు సత్యభామ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన 15 కిలోల సత్యభామ శాట్‌, పూణె ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు రూపొందించిన కిలో బరువైన స్వయంశాట్‌ కూడా నింగికి చేరనున్నాయి. ఇండోనేషియాకు చెందిన 120 కిలోల లపా-ఎ3, జర్మనీకి చెందిన 130 కిలోల బిరోస్‌, కెనడాకు చెందిన 85 కిలోల ఎం3 ఎంశాట్‌, 25.5కిలోల జిశాట్‌-డి, అమెరికాకు చెందిన 110 కిలోల కైశాట్‌-జెన్‌2-1, ఒక్కొక్కటి 4.7 కిలోల బరువు కలిగిన 12 డౌ ఉపగ్రహాలను రోదసీలోకి ప్రవేశపెట్టనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: