ఈ మద్య పోలీసులు చేస్తున్న వింత చేష్టలు చూస్తుంటే ఔరా అనిపిస్తుంది..ఆ మద్య కాంప్లెంట్ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తితో బూట్ పాలిష్ చేయించాడు ఓ పోలీస్.  సాధారణంగా హైటె వ్యభిచారం..మసాజ్ ముసుగులో కొనసాగుతుంది. బ్యూటీ పార్లర్ లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టు చేసిన పోలీసులు అని మనం చదువుతుంటాం..అయితే దీనికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. ఓ ఎస్ఐ తన స్టేషన్ లో ఓ మహిళతో బట్టలు విప్పి మరి మసాజ్ చేయించుకుంటున్న సమయంలో ఓ ఔత్సాహికుడు ఫోటో, వీడియో తీసి సోషల్ మీడియాల్ అప్ లోడ్ చేశారు.

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్ పోలీస్ స్టేషన్‌లో పబ్లిక్ గా ఓ నీచమైన పని చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లో హర్దోయ్ పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళతో బాడీ మసాజ్ చేయించుకున్నాడు సబ్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ యాదవ్. బట్టలు తీసేసి కింద కుర్చోగా మహిళ ఆయిల్‌తో అతగాడి బాడీ మొత్తం మసాజ్ చేసింది. అయితే మనోడు చేస్తున్న ఘనకార్యాన్ని ఓ అజ్ఞాత వ్యక్తి ఫోటో షూట్ చేయడం దాన్ని కాస్త సోషల్ నెట్ వర్క్ లో పెట్టడం జరిగింది. ఇది కాస్త డీజీ వరకు వెళ్లేసరికి ఆయన దీనిని సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో విచారణ జరిపించి ఆ ఎస్ఐను సస్పెండ్ చేశాడు.

అయితే సదరు పోలీస్ బాడీ మసాజ్‌కు సంబంధించి ఓ ప్రత్యేక ఆయిల్ తయారు చేస్తున్న దేవ్రియా గ్రామానికి చెందిన మహిళను స్టేషన్‌కు రమ్మని ఆర్డన్ వేసి మరీ ఆమెతో తన శరీరానికి మసాజ్ చేయించుకున్నాడట...కానీ అది తన ఉద్యోగానికే ఎసరు తీసుకు వస్తుందని బావించలేదు. మొత్తానికి ఈ పోలీస్ ఉద్యోగం పోయిన తర్వాత ఎవరి కంటికీ కనిపించకుండా పోయడాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: