తెలుగు రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజ‌కీయాలు ఎక్కువే. అఫ్ కోర్స్ ఇలాంటి రాజ‌కీయాలు దేశంలో అన్ని ప్రాంతాలు ఉన్నాయ‌నుకోండి అదివేరు. అయితే, అందులో వారి వారి చ‌రిష్మా, వాక్చ‌తుర్యాల‌ను బ‌ట్టి ప్ర‌జ‌లు నాయ‌కుడిగా ఎన్నుకుంటారు. ఇక్క‌డ తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ రాజ‌కీయంగా మంచి పేరు తెచ్చుకుంటే.. ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ప‌రిస్థితి మాత్రం ప్ర‌శ్న‌ర్ద‌కంగా ఉంది. దాదాపుగా ఏపీ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను గ‌త 2009 నుంచే తిర‌స్క‌రిస్తూ వ‌స్తున్నారు. నారా లోకేష్ రాజ‌కీయాల్లో కి ఎంట్రీ అయిన టైం బాగోలేదో లేక ఆయ‌నకు ప్ర‌జ‌ల‌ను చేరువయ్యే  వ్యూహాలు తెలియ‌దో గానీ... అధికారంలో ఉన్నా లోకేష్ రోజుకింత రాజ‌కీయంగా దిగ‌జారి పోయే ప‌రిస్థితి ఎర్ప‌డింది. టీడీపీ పార్టీ కార్య‌కర్త‌ల సంక్షేమ నిధి కార్య‌ద‌ర్శి, పార్టీ కేంద్ర జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గా ఉన్నా ఆయ‌న‌ను అంత‌గా ప‌ట్టించుకునే నాదుడే కరువ‌య్యార‌ట‌! ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను బ‌ట్టి లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది.

ఇచ్చిన హామీల‌ను నమ్మి బాబుకు ప‌ట్టం క‌ట్టారు....

2009 అప్ప‌టి ఉమ్మ‌డి రాష్ట్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెర‌పైకి వ‌చ్చిన లోకేష్ బాబు ఎంతో అట్ట‌హ‌సంగా ఎన్నిక‌ల హామీల‌ను సూచించిన న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం బెడిసికొట్ట‌డ‌మే కాకుండా టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఘోర ప‌రాజ‌యం పాలు అయింది. త‌రువాత సైలంట్ గా ఉన్న లోకేష్, అడ‌పాద‌డ‌పా పార్టీ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్న కానీ, గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెర‌పైకి వ‌చ్చి... ఆంధ్ర లో రైతుల‌ను మీ అప్పుల‌ను తిరిగి బ్యాంక్ ల‌ను చెల్లించ‌కండి మేము అధికారంలో వ‌స్తే రుణాలు అన్ని మాపీ చేస్తాం అని రుణ‌మాఫీ ప‌థ‌కం ప్ర‌క‌టించ‌మ‌ని తండ్రికి సూచించారు. కాక‌పోతే లోకేష్ చూపించిన ఈ ఒక్క హామీ మాత్ర‌మే కాకుండా చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను న‌మ్మి ఆంధ్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు కు ప‌ట్టం క‌ట్టారు. అయితే ఇక్క‌డ లోకేష్ చెప్పిన స‌ల‌హా పని చేయ‌లేదు. ఒక‌వేళ చేస్తే అధికార ప‌క్ష‌మైన  టీడీపీ కి ప్ర‌తిప‌క్ష మైన వైసీపీ కి ఉన్న ఓట్ల శాతం కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే. అంటే ఇక్క‌డ కూడా చిన‌బాబు గారి స‌ల‌హా పార‌లేదు.

ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల చేరిక‌లో లోకేష్ పాత్ర ఏమీలేదు...

ఇక రాష్ట్రంలో  అధికారంలోకి వ‌చ్చినాక అయిన లోకేష్ గారి హ‌వా న‌డిచిందా అటే అది లేదు? ఎందుకంటే ప్ర‌స్తుత ఆంధ్ర లో చేరుతున్న ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల చేరిక‌ల వెన‌క లోకేష్ బాబు హ‌స్తం ఉంది అంటే అతిశ‌యోక్తే. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఆది నుంచి ఎమ్మెల్యేల‌ను కొనే అల‌వాటు ఉన్న అత‌ను కోట్లు కోట్లు కుమ్మ‌రించి ఎమ్మెల్యేల‌ను కొంటున్నాడు. దానికి ప్ర‌త్యేక్ష ఉదాహ‌ర‌ణ తెలంగాణ‌లో ఒక్క ఎమ్మెల్సీనే 5 కోట్ల‌కు కొన‌డానికి వెళ్లి అడ్డంగా బుక్ అయిన తెలంగాణ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉదంతం. అంతే కాదు గ‌త 1994 లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ ను గ‌ద్దే దించేందుకు నాటి కాబినేట్ మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసి మామ్మ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికే ఎస‌రు పెట్టారు. అప్ప‌ట్లో చంద్ర‌బాబు రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ను కొంత మంది పొగిడినా... ఎన్టీఆర్ మాత్రం ఈ ప‌రిస్థితిని త‌ట్టుకోలేక‌నే గుండె పొటుతో మృతి చెందార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అంటే ఇక్క‌డ కూడా ఆంధ్ర‌లో ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను చేర్చుకోవ‌డంలో లోకేష్ గారి పాత్ర ఏమీలేదని క్లారిటీగా అర్ద‌మవుతుంది.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ లోకేష్...

ఇక ఎంతో నమ్మ‌కంతో తెలంగాణ‌లో గ్రేటర్ హైద‌రాబాద్ మున్సిఫ‌ల్ ఎన్నిక‌ల‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నారా లోకేష్ బాబు  ఎన్నిక‌ల్లో మేము ఖ‌చ్చితంగా 100 సీట్ల‌ను గెలుస్తామ‌ని, టీఆర్ఎస్ పార్టీ ప‌త‌నానికి నాంది ప‌లుకుతామ‌ని, తెగ ప్ర‌చారం చేసిన నారా లోకేష్ క‌నీసం సింగ‌ల్ డిజిట్ కూడా దాటించ‌లేక‌పోయాడు. ఒకే ఒక్క‌డు అన్న‌ట్లు కుకట్ ప‌ల్లి లో అది కూడా అధికార పార్టీకి చెందిన ఉద్య‌మ‌కారుడు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వ‌లేదు. అనే బాధ‌తో టీడీపీకి సపోర్టు చేసిన‌ట్టు త‌రువాత అంద‌రికి అర్ద‌మైంది. దీనిని బ‌ట్టి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో గెలిచినా ఒక్క సీటుకు కూడా లోకేష్ గారి సామ‌ర్ద్యం ఏమీ లేద‌ని అర్ధ‌మైంది.  ఇలా లోకేష్ గారు అడుగుపెట్టిన ప్ర‌తి చోట గెల‌వ‌డం ప‌క్క‌న పెట్టు క‌నీసం డిపాజిట్లు కూడా రావ‌డం లేదు. అంతేకాకుండా ఆయ‌న ప‌లు పార్టీ స‌మావేశాల‌లో స్వంత పార్టీ యొక్క అసలు నైజం కూడా బ‌య‌ట పెట్టాడు. ఒకానొక సమ‌యంలో మాట్లాడుతూ... బంధు ప్రితీ, కుల పిచ్చి, ప్రాంతీయ త‌త్త్వం అన్ని ఉన్న పార్టీ ఉంది అంటే అది టీడీపీ పార్టీ మాత్ర‌మే అని ఆయ‌న లైవ్ లో అన్నారు.

తండ్రిని అడ్డుపెట్టుకుని లోకేష్ చేయ‌ని దందాలేదు....

క‌నీసం నేత‌ల‌కు కాదు క‌దా కనీసం కార్య‌క‌ర్త‌ల సమావేశంలో కూడా సరిగా మాట్లాడ‌టం చేత‌కాని నారా లోకేష్, ఇక తండ్రి సీఎం అయినా త‌న ప‌లుకుబ‌డి ఏమ‌న్నా పెరిగిందా? అంటే అది లేదు. ఆయ‌న త‌న తండ్రి ని అడ్డు పెట్టుకొని చేయ‌ని దందాలేదు. రాజ‌ధాని పేరిట భూములు లాక్కోవ‌డం దగ్గ‌ర నుంచి నిన్న మొన్న బ‌య‌ట‌కు వ‌చ్చిన కాల్ మనీ వ‌ర‌కు త‌మ తెలుగు త‌మ్ముళ్ల హ‌స్తం ఉందని ఆంధ్ర ప్ర‌జానీకం ఎరిగిన స‌త్యం.  ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు అధికార టీడీపీ నేత‌లు చేస్తున్న ప‌లు అవినీతి అక్ర‌మాల వ‌ల‌న వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌లే కాదు, ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన వైజాగ్, తిరుప‌తి కార్పోరేష‌న్లు ఎన్నిక‌లు లో ఓడిపోతామ‌ని నిజం తెల్చే చంద్ర‌బాబు  ఎన్నిక‌లకు పోవ‌డం లేదని రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.  తాజాగా చంద్ర‌బాబు స‌ర్కార్ కుల రాజ‌కీయాలను అస‌రా గా చేసుకుని రాజ‌కీయాలు న‌డిపిస్తుంది. గ‌తంలో నుంచి పార్టీ కులాల కుంప‌టి ని రాజేసి పబ్బం గ‌డుపుకుని రాజకీయంగా ఎద‌గ‌డం చంద్ర‌బాబుకు ష‌రామాములే. ఎవ‌రు తొడుకున్న గొతి లో వారే ప‌డ‌తార‌న్న సందంగా చంద్ర‌బాబుకు కాపు వ‌ర్గం నుంచి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త పెరుగుతూ వ‌స్తుంది.

లోకేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ద‌క‌మే...

2014 లో అనుకోకుండా అధికారంలోకి వచ్చిన చంద్ర‌బాబు త‌న త‌న‌యుడికి పూర్తి స్థాయి రాజ‌కీయ నాయకుడిని చేయ‌లేక‌పోయారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం చంద్రబాబుకు ప‌త‌నం త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ మేధావులు అంచ‌నాలు వేస్తున్నారు. నారా లోకేష్ సైతం పార్టీ  గ‌ట్టెక్కించే స్థాయిలో లేరు. ఆయ‌న మాట‌ల‌ను ఏపీ ప్ర‌జ‌లు పూర్తి స్థాయిలో విశ్వ‌సించ‌డంలేదు. ఇప్ప‌టికిప్పుడు నారాలోకేష్ ఎదో గార‌డీ విద్య ను చేస్తే త‌ప్ప పార్టీ అధికారం లోకి రాదు. అఫ్ కోర్స్ ఇప్ప‌టికే ఏపీలో వైకాపా నేత జ‌గ‌న్ కాబోయే సిఎం అని సంకేతాలు కూడా విన‌బ‌డుతున్నాయి.  ఏది ఏమైనా కానీ ప్ర‌స్తుతం వ్య‌వ‌హ‌రిస్తున్న చంద్ర‌బాబు తీరు, నారా లోకేష్ నాయ‌కత్వ లేమీ వ‌ల‌న లోకేష్ బాబు రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్ద‌క‌మే!


మరింత సమాచారం తెలుసుకోండి: