తమ కమిటీ రూపొందించిన నివేదికను బుధవారం జస్టిస్‌ జే.ఎస్‌. .వర్మ కేంద్రహోంమంత్రిత్వ శాఖకు సమర్పించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి కనీస శిక్షను మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని అభిప్రాయపడ్డారు. మన దేశం నుంచే కాక విదేశాల నుంచి కూడా సూచనలు వచ్చాయని ఆయన తెలిపారు. పోలీసు స్టేషన్‌లలో కనీసం 25 శాతం మహిళా పోలీసులు ఉండాలని, బాలనేరస్తుల వయస్సును 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. నేర తీవ్రతను బట్టి శిక్షణే విధించే విచక్షన జడ్జిలకే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నివేదిక రూపొందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల చట్టాలను పరిగణలోకి తీసుకున్నామని, ప్రజల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకున్నామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: