చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) కారణంగా చిన్న వ్యాపారుల ప్రయోజనాలకు నష్టం కలగకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌డీఐల కారణంగా దేశంలో స్వేచ్ఛా వ్యాపారం ముఖ్యంగా చిన్న వ్యాపారుల ప్రయోజనాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపడుతున్నారో వివరిస్తూ మూడు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్న వ్యాపారుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా ఎఫ్‌డీఐ విధానంలో ఉన్న నిబంధనలేమిటి, పెద్ద వ్యాపార సంస్థలు రేట్లు తగ్గించేసి, అనుచిత వ్యాపారాన్ని చేస్తే చిన్న వ్యాపారుల పరిస్థితేమిటి, ఎఫ్‌డీఐ విధానం ఏమైనా ఫలితాలనిచ్చిందా, ఇప్పటివరకు ఏమైనా పెట్టుబడులు వచ్చాయా, లేక ఇది రాజకీయ గిమ్మిక్కేనా అని కోర్టు ప్రశ్నించింది. మరో వైపు ఎఫ్‌డీఐలపై కోర్టు చేసిన వ్యాఖ్యలను అఖిల భారత వ్యాపారుల సంఘం స్వాగతించింది. చిన్న వ్యాపారుల ప్రయోజనాలను పరిరక్షించాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పడంపట్ల హర్షం వ్యక్తం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: