ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురై మృతి చెందిన ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయ తన జీవితంలో చివరిసారి రాసిన 73 శాతం మార్కులతో అగ్రస్థానం సాధించింది. ఈ విషయాన్ని ఆమె చదివిన సాయి ఇన్‌స్టిట్యూట్ డీన్ హరీష్ ఆరోరా గురువారం వెల్లడించారు. సహ విద్యార్థుల కంటే నిర్భయ బాగా చదివేదని, 2008లో తమ సంస్థలో చేరిందని చెప్పారు. ఆమె పేరిట ఏటా ప్రతిభగల విద్యార్థికి అవార్డు బహూకరిస్తామని నిర్భయ చదివిన విద్యాసంస్థ డీన్ చెప్పారు. ఆమె చెల్లించిన రూ.1.80 లక్షల ఫీజును వాపసు చేస్తామన్నారు. తన మనవరాలు తమ మధ్య ఉంటే ఈ ఫలితాలతో కుటుంబంలో ఆనందం ఆకాశాన్నంటేదని ఆమె తాత గద్గదస్వరంతో వ్యాఖ్యానించారు. హెచ్‌ఎన్‌బీ గర్వాల్ వర్సిటీ గత ఏడాది మొత్తం ఆరు పరీక్షలు నిర్వహించింది. ఇందులో మొత్తం 1,100 మార్కులకుగాను మృతురాలు 800 మార్కులు సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: