‘‘తెలంగాణ అంటే మట్టి, కొండలు, గుట్టలు, నదులు కాదు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు బతకాలి. శుక్రవారం నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో జరిగిన చేనేత శంఖారావం బహిరంగ సభలో తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రాం ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణ వస్తే దాని ఫలాలు అందరికీ దక్కాలని భావించాం. కానీ గ్రామాల్లోకి వెళ్లి చూస్తే చేనేతతో పాటు కులవృత్తులు అధ్వాన పరిస్థితుల్లోకి వెళ్లాయి. 

తెలంగాణ అంటే మట్టి కాదు


చేనేత కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న పోరాటం న్యాయమైంది. ఐదు జిల్లాల్లో రెండు లక్షల మంది ఒక్క చేనేత రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారు పడుతున్న అవస్థలపై సీరియస్‌గా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలను చూపాలి’’ అని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. చేనేత సంఘాల నాయకులు ఐక్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంతో చేనేత పరిశ్రమ అటకెక్కలేదని తెలియాలని.. ఈ మేరకు పాలకులకు కనువిప్పు కలగాలని అన్నారు. చేనేత పరిశ్రమ పరిరక్షణకు తెలంగాణ జేఏసీగా తమ వంతు కృషి చేస్తామన్నారు.



ఆగస్ట్ 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. చేనేత పరిరక్షణ కోసం జేఏసీ అన్ని వర్గాలను కూడగట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులను సాధించుకుంటామన్నారు. తెలంగాణకు గుర్తింపు, గౌరవం పోచంపల్లి, నారాయణపేట, గ ద్వాల, గొల్లభామ చీరెలు, వరంగల్ కార్పెట్లు, మహదేవ్ టస్సార్ చీరలేనన్నారు. ఉపాధి హామీ పథకంలో కొకూన్స్ ఏరడానికి హామీ ఇవ్వాలని కోరినా.. ఇంతవరకు హామీ దక్కలేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: