వైసీపీలో జగన్ తర్వాత సెకండ్ ప్లేస్ ఎవరది.. అసెంబ్లీలో జగన్ తర్వాత టీడీపీని దుమ్ముదులిపే నేత ఎవరు... చంద్రబాబును విమర్శించాలంటే ఎనీ టైమ్ ముందుకొచ్చే వైసీపీ నేత ఎవరు.. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం వస్తుంది.. అదే ఆర్ కే రోజా. వైసీపీలో ఆమె అంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. 

రోజా ఎంత యాక్టివో.. వివాదాలు అంతే ఎక్కువ.. తోటి ఎమ్మెల్యేలపై నోరుపారేసుకుందని.. పవిత్రమైన అసెంబ్లీలో అసభ్యకరమైన భాష వాడిందని.. ఇలా చాలా కంప్లయింట్లు ఉన్నాయి. అందుకే ఏకంగా ఆమె అసెంబ్లీ సభ్యత్వాన్నే రద్దు చేసేద్దామని కూడా టీడీపీ నేతలు  ఆ మధ్య ఉత్సాహపడ్డారు. 


అలాంటి రోజా ఇప్పుడు ఓ కేసు విషయంలో చిక్కుల్లోపడ్డట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ తరపున బరిలోకి దిగిన రోజా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పులు చూపించారని రాయుడు అనే వ్యక్తి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఆమె ఆస్తుల్లో తేడాలున్నాయన్నది ఆయన ప్రధాన అభియోగం. 

ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆమె ఎన్నిక రద్దు చేయాలని ఆయన తన పిటీషన్ లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు రోజాకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని రోజా ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ రెండు పిటీషన్లను ఒకేసారి వాదనలు వింటామని తెలిపింది. 

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రోజా ఒకేసారి రెండు పిటిషన్ల వాదనలు వినడం చట్టవిరుద్దమని పేర్కొంటున్నారు. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టును సవాల్ చేశారు రోజా. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పు చెబుతుందో.!?



మరింత సమాచారం తెలుసుకోండి: