మంగళవారం మోడీ కేబినెట్ ను విస్తరించారు. 19 మంది కొత్త వారికి చోటు కల్పించారు. వీరందరిలోనూ ఎక్కువగా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి మాత్రం 35 ఏళ్ల అనూ ప్రియ పటేల్ అని చెప్పుకోవచ్చు. అంతగా ప్రాచుర్యంలేని అప్నాదళ్ పార్టీ నుంచి ఈమె ఎంపీగా ఎన్నికయ్యారు. ఈమె రాజకీయ ప్రస్తానంలోని మలుపులు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఆ వివరాల్లోకి వెళ్తే.. యూపీలో సోనేలాల్ అనే నేత అప్పాదళ్ అనే పార్టీని స్థాపించారు. ఆయన 2009 లో అనారోగ్యంతో మరణించారు. తర్వాత తల్లి కృష్ణ పటేల్ అద్యక్ష బాద్యతలు స్వీకరించారు. ఈ పార్టీ 2014 లో ఎన్నికల్లో బిజెపి తో పొత్తుపెట్టుకుని రెండు ఎంపీ సీట్లు గెలిచింది. అనుప్రియ పటేల్ తో పాటు  హరివంశ్ సింగ్ అనే మరో నేత కూడా గెలిచారు. 


ఆ తర్వాత పార్టీ నిర్వహణలో తల్లీ,కూతుళ్ల మద్య విబేధాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అనుప్రియను పార్టీ నుంచి తల్లి సస్పెండ్ చేసింది. యూపీలో ఎన్నికల నేపథ్యంలో అనుప్రియను మోడీ ఎంపిక చేసుకున్నారు. వీరి సామాజిక వర్గమైన కూర్మికి యూపీలో మంచి ప్రాధాన్యం ఉందట. 

అనుప్రియ నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది. ఢిల్లీలోని ప్రఖ్యాత శ్రీరాం మహిళా కాలేజీలో ఈమె చదివారు. సైకాలజీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేసింది. ఉన్నత విద్యాధికురాలైన అనుప్రియను కేంద్రమంత్రిగా చేయడం పార్టీకి మంచిదని భాజపా నేతలు భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: