గూగుల్, యాహూ.. ఇంటర్ నెట్లో ఏదైనా సమాచారం కావాలంటే ముందు ఆశ్రయించిన వెబ్ సైట్లు ఇవే.. ఇక గూగుల్ సంగతైతే చెప్పనక్కర్లేదు.. అసలు గూగుల్ తప్ప వేరే సెర్ట్ ఇంజిన్లంటూ కొన్ని ఉన్నాయన్న సంగతి కూడా చాలామందికి తెలియనంతగా పాపులర్ అయ్యింది. ఏ సమాచారమైనా గూగుల్ వెదకాల్సిందే. 

మరి అలాంటి గూగుల్, యాహూ వంటి సెర్చ్ ఇంజిన్లపై సుప్రీం కోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ అవసరం ఏమొచ్చింది. ఎందుకంటే.. ఈ సెర్ట్ ఇంజిన్లు అనేక యాడ్లను ప్రదర్శిస్తుంటాయి. అయితే అలాంటి ప్రకటనల్లో కొన్ని అభ్యంతరకరమైనవి కూడా ఉంటున్నాయట. ప్రత్యేకించి గర్బస్థ శిశువు లింగ నిర్థరణ పరీక్షలు నిర్వహించే వారు కూడా ఈ సెర్ట్ ఇంజిన్ల నుంచి ప్రకటనలు ఇస్తున్నారట. 


వాస్తవానికి అలాంటి పరీక్షలు ఇవ్వడం చట్టరీత్యా నేరం. కేవలం నేరమే కాదు సామాజికంగా దారుణం కూడా. కానీ ఈ సెర్చ్ ఇంజిన్ల ఇలాంటి ప్రకటనలు కూడా ఇస్తున్నాయట. ఈ గర్భస్థ లింగ నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన ప్రచార ప్రకటనల్ని అడ్డుకోవడంలో సెర్చ్ ఇంజిన్లు ఫెయిల్ అవుతున్నాయని సుప్రీం కోర్టు ఫైర్ అయ్యింది. 

ఆయా సెర్చ్  ఇంజిన్లు 10 రోజుల్లో ఈ సమస్య నివారణ కోసం టెక్నికల్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయాలని తీర్పు చెప్పింది. దేశంలో అడపిల్లల సంఖ్య తగ్గుదలపై దాఖలైన ఓ పిల్ పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ తీర్పు చెప్పింది. లింగ నిర్ధరణ పరీక్షలకు సంబంధించిన యాడ్స్ ఇవ్వడం ద్వారా సెర్చ్  ఇంజిన్లు భారతీయ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నాయని సుప్రీం కోర్టు తేల్చి చెప్పిందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: