ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టానికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టానికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ సందర్భంగా జాతీయ ప్రణాళికా సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ నరేంద్ర జాదవ్‌ మాట్లాడుతూ ప్లానింగ్‌ కమిషన్‌కు పరిమిత అధికారాలు ఉండడంతో ఏమీ చేయలేకపోయామని , ఎస్సీ, ఎస్టీల మధ్య అంతరం తొలగిపోవాలని సూచించారు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టరూపం దాల్చడం చారిత్రాత్మకమని, సబ్‌ప్లాన్‌పై ఏం జరుగుతుందో అని దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టాయని అందుకే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాహసోపేతమయిన నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ సబ్‌ప్లాన్‌ చట్టరూపం దాల్చడంతో 35 శాతం పని పూర్తయిందని, సబ్‌ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసినపుడే సంతృప్తిగా ఉంటుందని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: