ఆందోళనలు, అరెస్ట్ లు, ఉద్రిక్తతతల నడుమ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పొలిటికల్ జేఏసీ తలపెట్టిన సమరదీక్షకు అనుమతి ఇచ్చింది. జేఏసీ కోరినట్టుగా 36 గంటల దీక్షకు అనుమతి ఇస్తున్నామని... దీక్షను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సీపీ అనురాగ్ శర్మ సూచించారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు దీక్ష అనుమతి ఉందని.. అయితే 2 వేల మంది మాత్రమే పాల్గొనేలా చూసుకోవాలని కోరారు.  పోలీసులు దీక్షకు అనుమతించడంతో.. జేఏసీ కార్యాలయంలో దీక్ష చేపట్టిన నేతలు సమరదీక్షను మార్చారు. ఇందిరా పార్క్ వద్ద ప్రారంభమైన దీక్షలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్‌గౌడ్, విఠల్, దేవీ ప్రసాద్, న్యాయవాదులు, డాక్టర్లు, కళాకారులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. దీక్ష ప్రాంగణానికి తెలంగాణవాదులు భారీగా చేరుకుంటుండంతో.. జై తెలంగాణ నినాదాలు మార్మోగుతున్నాయి. జేఏసీ దీక్షకు టీఆర్ఎస్ పార్టీతోపాటు, న్యూడెమోక్రసీ, బీజేపీ, నేతలు కూడా మద్దతు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: