"పన్నెండు  యేళ్ళ అందమైన కన్నె పిల్ల $ 12500/- ఖరీదులో అమ్మకానికి సిద్ధంగా ఉంది,  ఆలశించిన ఆశాభంగం"  అంటూ ఒక వ్యాపార ప్రకటన అంత తెలికగా మానవత్వానికి పొసగని ప్రకటనను ‘స్మార్ట్ ఫొన్ యాప్’  ద్వారా పిల్లులు, పక్షులు, ఆయుధాలు, వ్యూహాత్మకయంత్రాల అమ్మకాల  ప్రకటనలతో పాటు ‘అసోసియేటెడ్  ప్రెసు’ కు ఒక "ఐ ఎస్ ఐ ఎస్"( ఐసిస్) కార్య కర్త విడుదల  చేసినట్లు,  ‘యాహూ న్యూస్ వార్తా సంస్థ’  తెలిపింది.


ఖుర్దిష్ & యజిడి యువతులపై ఐసిస్ దుర్మార్గం 



యాజిడి జాతికి చెందిన స్త్రీలను, ఆడపిల్లను చెరపట్టిన సెక్స్-బానిసలుగా మార్చి అమ్మేస్తున్న ఐసిస్ ఉగ్రవాదుల దురాగతాలకు అంతులేకుండా పోతుంది.   ఐసిస్ యుద్ధానికి ముందు ఐదు లక్షల వరకున్న జనసంఖ్య ఉన్న యాజిడి జాతి జనాభా ఇప్పుడు ఎంతుందో చెప్ప లేని విధంగా పడిపోయింది.  “యాజిడి జాతి కొంత ఇస్లాం, మరి కొంత క్రిష్టియానిటి, ఇంకొంత జురాష్ట్రియనిజం సంస్కృతి తో కూడిన అతిపురాతన పర్షియన్ తెగ”. వీరికి ధైర్యం, తెగువ చాలా ఎక్కువ. కాని వీరిని ఐసిస్ ఉగ్రవాదులు మనుషులుగా ఏమాత్రం చూడరు. సంతలో పసువుల్లా చూస్తారు. తమ పట్టుతప్పుతున్నట్లు భావిస్తున్న ఈ తెగ వలన తాము ఆశిస్తూ నిర్మించాలనుకున్న ఖలీఫా పాలనకు తీవ్రమైన దెబ్బ తగలవచ్చని భావించి వారి 3000 మందికి పైగా స్త్రీలను ఆడపిల్లలను చెరబట్టి సెక్స్ బానిసలుగా మార్చి అమ్మకానికి పెట్టి తమ ఉగ్రవాద సంస్థ ఆదాయాన్ని విపరీతంగా పెంచుకొంటున్నారు. 


యజిడి అందం 



యజిడి 5000 సంవత్సరాల చరిత్రగల అతిపురాతన ఇరాక్, ఇరాన్, టర్కీ పర్వత ప్రాంతాలలో నివసించే ఒక ఆటవిక తెగ. వీరి ఆచార వ్యవహారాలు సాధారణ ఇస్లాంకు భిన్నంగా ఉంటాయి. సాధారణ ఇస్లాం మతస్తులు వీరిని వీరి నమ్మకాలను, మత విశ్వాసాలను అసహ్యించు కుంటారు. యజిడీల సిద్ధాంతం ప్రకారం వారు యజిడీలుగానే పుడతారు, యజిడీలు కానివారు చేసిన ఆహారాన్ని గాని, వస్తువులను గాని వీరు టచ్ చేయరు. సిల్క్, నీలి వస్త్రాలు దర్శించరు. కరువు పరిస్థితులు తలెత్తినప్పుడు బొమ్మలు తయారుచేసి వాటిని అలంకరించి వర్షదేవతలుగా వాటిని భావించి పూజిస్తారు. వర్షం వారి భూమిపై పడాలని ప్రార్ధిస్తారు.    నీలికళ్ళు, పలుచని శిరోజా లు  అందంగా ధృడంగా ఆరోగ్యంగా ఉండే  యజిడి వనితలను సొంతం చేసుకోవటానికి ఐసిస్ వారి పురుషులను నిర్దాక్షిణ్యంగా చంపేసి,  స్త్రీలను పట్టుకు పోతారు.  వీరిని "దెయ్యం రూపాలుగా "భావించే కరుడుగట్టిన ఇస్లామీయులైన ఐసిస్ తీవ్రవాదులు వినోదంకోసం  వీరిని అతి ధారుణముగా చెరచి వికృతానందం పొంది తరువాత సెక్స్ బానిసలుగా మార్చి అమ్మేస్తారు.


ఖుర్ధిష్ సౌందర్యం 



ఇలాంటి మరోతెగ ఖుర్దిష్ తెగ. వీరిలో ఎక్కున మంది ఇస్లాం మతస్థులు. వెండి బంగారు నాణేలతో తయారైన ఆభరణాలను ఈ ఖుర్దిష్ స్తీలు ధరిస్తారు. స్త్రీలు ట్రౌజర్స్, టాప్స్ సాధా రణంగా ధరించే వీరు, తమ దుస్తులను తాము గుర్రపు స్వారీ కి అనుగుణంగా వెనుక కూర్చొ ని ప్రయాణం చేయటానికి వీలుగా ధరిస్తారు.  ఇతర ముస్లిం జాతుల్లా ముఖాన్ని వస్త్రంతో పురుషులకు కనిపించకుండా కప్పుకోరు. బుర్ఖా సంస్కృతిని పాటించరు. కాని వివాహాల్లో ఉత్సవాల్లో స్త్రీ పురుషులూ విడి విడి గదుల్లో ఉంటూ, ఇతర ముస్లిముల్లా కూర్చుంటారు విందు చేసుకుంటారు. ఎలాంటి సామూహిక కలయికల్లో స్త్రీ పురుషులమధ్య ఎలాంటి సమా చారమార్పిడి ఉండదు. కుర్డ్ జాతి ఇతర జాతులను, తెగలను, సంస్కృతులను, నమ్మకాలను విశ్వాసాలను పూర్తిగా గౌరవిస్తారు. కుర్ధిష్ వనితలు తమ భర్తలను తామే ఎన్నుకొనే స్వేచ్చ కలిగిఉంటారు. చాల సందర్భాల్లో వీరి ఎంపిక కుటుంబ సభ్యులకు వ్యతిరేఖంగా ఉండదు. తమ సోదరులుగాని తండ్రిగాని బలప్రయోగముతో వీరిని వాంచిస్తే వీరికి ఎదురుచెప్పే అవకాశం ఈ తెగకు లేదు. వాంచించిన తండ్రి సోదరులను వలదనే పరిస్థితి వీరి తెగ స్త్రీలకు భయంకర పరిస్థితి అత్యంత అవమానకరము గా ఈ తెగ భావిస్తుంది.  ఈ రెండు తెగల్లో విడాకులు అనేదే లేదు. నాగరికత తెలిసిన ఈ జాతిపై కూడా ఐసిస్ కత్తికట్టింది.


యుద్ధానికి "సై"  అంటున్న ఖుర్ధిష్ యువతులు



గోధుమ వర్ణం కళ్ళు, నల్లని శిరోజాలతో అందమైన దృఢమైన శరీరాకృతి కలిగిన ఈ స్త్రీలు ఐసిస్ ను ఎదిరించి యుద్ధాలు కూడా చేస్తున్నారు. వీరిలోని వీరత్వం మన రాణి రుద్రమ, ఝాన్సీ లక్ష్మి బాయితో పోల్చవచ్చు. అరుదైన వ్యక్తిత్వం వీరిది. ఇంత అందమైన స్త్రీలను చేజిక్కించు కోవటానికి అక్కడ పురుషులపై ఐసిస్ తీవ్రమైన దాడులు చేసి చంపేస్తున్నారు. స్త్రీలు పసివాడని పాపలను చరాస్తులుగా అమ్మేస్తూ హింసకు గురిచేస్తు న్నారు. అంతేకాదు ఆ స్త్రీల ఫోటోలను వారి యజమానుల వివరాలను ఎప్పటికప్పుడు డేటా బేస్ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఐసిస్ చెక్-పోస్టుల వద్ద వారు తప్పించుకు పోకుండా. అవసరమైతే బందీలను విడిపించేటప్పుడు పట్టుబడ్డ వీరి ప్రధాన ఆదాయవనరులైన స్మగ్లర్స్ ను కూడా హత్య చేసైనా డబ్బు దోచుకుని ఈ సెక్స్ బానిసల సంఖ్య తగ్గకుండా చూసు కుంటారు ఈ ఐసిస్ యువకులు. ఈ విధంగా ఫండ్-రైజింగ్ కోసం ఈ రెండుజాతుల స్త్రీలను అమ్మకాలు జరుపుతారు. ఈ యజిడీ, కుర్దిష్ జాతుల నిర్మూలనకై 2014 లో ఉత్తర ఇరాక్ గ్రామాల పై పడి వారి సంపద, స్త్రీలను దోచేసుకున్న ఈ ఐసిస్ దౌష్ట్యం రాయటానికి అలవి కానిది. ఈ ఆకర్షనీయ స్త్రీల పొందు కోసమే వివిధ దేశాల్లోని యువత ఐసిస్ వలలో చిక్కు కుంటుందని విజ్ఞులు చెపుతారు.




అరబ్ ఖుర్దిష్ స్మగ్లర్స్ ద్వారా గతములో నెలకు సగటున 134 స్త్రీలు తప్పించుకుని విముక్తు లౌతుంటే ఆ సంఖ్య క్రమగా ఇప్పుడు 34 కు చేరిందని ఖుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వం తెలిపింది.  మీర్జా దానయి అనే జర్మన్-ఇరాఖి సహకార సంస్థ నిర్మాత ఇప్పుడు ఇలా చెరబట్టిన స్త్రీలను విడిపించటం చాలా కష్టమౌతుందని చెప్పుతున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు ఈ స్త్రీ ప్రిజనర్స్ ను సాంకేతిక పద్దతుల్లో రిజిస్ట్రేషన్ & డేటాబేస్ నిర్వహణ ద్వారా ఒక యజమాని క్రింద ఉన్న సెక్స్ బానిసలైన వనితలను చెక్ పాయింట్ల వద్ద గుర్తించి జారిపోకుండా కట్టుదిట్టం చేస్తున్నారు. 




జాన్ కిర్బి అనే యు.ఎస్ ప్రభుత్వ ప్రతినిధి చెప్పినట్లు విలువైన నిర్ధారణ ఉన్న స్త్రీ రవాణా - వినియోగాన్ని, ఐసిస్ దుర్మార్గాన్ని వీలున్నంతగా వారి హీన కృత్యాలను వెలుగులోకి తెచ్చి బహిరంగపరిస్తే ఇస్లాంకు లో వీరికి మద్దతు తగ్గవచ్చని తెలుస్తుంది. ఇస్లాంకు ఐసిస్ పై విశ్వాసం సన్నగిల్లి మన ప్రయత్నాలకు బలం చేకూరవచ్చని అంటున్నారు.


ఖుర్ధిష్ - యజిడి బ్యూటీ



నదియా మౌరద్ అనే వారినుండి తప్పించుకున్న యువతి యు.ఎస్. కాంగ్రెసుకు, ఈ.యు పార్లమెంటుకు సహాయం చేయవలసిందిగా కోరింది. ఆమె మాటల ప్రకారం ఐసిస్ తీవ్ర-ఉగ్ర  వాదులు వీళ్ళను ఎవరైనా దాడి చేస్తే మానవ కవచాలుగా వాడుకొంటారని, ఏవిధంగానైనా తప్పించుకునే అవకాశమివ్వరని, అవసరమైతే హత్యైనా చేయటానికి వెనుకాడరని, వీళ్ళంత నరరూప రాక్షసులుండరని వీరి హృదయాంతరాళ్ళలో వెదికినా కలికానికి కూడా మానవత కనిపించదని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: