ఇవాళ్టి ‍ ( మంగళవారం నుంచి )  ఏపీ ఎంసెట్ వైద్య విద్య కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతోంది. ఈసారి ఫస్ట్ టైమ్ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రెడీ అవుతోంది. నేటి నుంచి ఈనెల 17 వరకూ సర్టిఫికెట్ల పరిశీలన  ఉంటుంది.

ఏపీ ఎంసెట్ కు సుమారు లక్షమంది హాజరయ్యారు. వారిలో 60 వేల మంది కౌన్సిలింగ్ కు అర్హత సాధించారు. వీరిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 10 వేల మంది ఉన్నారు. రాష్ట్రంలోని 27 మెడికల్ కళాశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరానికి 3,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.


19 బీడీఎస్ కళాశాలల్లో  మరో 1290 దంత వైద్య సీట్లు ఉన్నాయి. తెలంగాణ నుంచి 15 శాతం నాన్ లోకల్ సీట్ల కోసం వెబ్ కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు కేవలం హైదరాబాద్ , విజయవాడ కేంద్రాలకు మాత్రమే రావాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. బీసీ ధృవపత్రాలకు సంబంధించి ప్రతి విద్యార్థి తల్లితండ్రులూ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కుల ధృవీకరణపై ఒక అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో పరిశీలన సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ లో మరో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మెడికల్ కు సంబంధించి ఈ ఏడాదికి మాత్రమే కన్వీనరు కోటా సీట్లను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే భర్తీ చేసుకునే ఛాన్స్ సుప్రీం కోర్టు కల్పించింది. మొత్తం ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో యాభై శాతం కన్వీనరు కోటా సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. మిగిలిన యాజమాన్య కోటా సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: