అమరావతి తరలిపోయేందుకు ఐఏఎస్ లు, ఇతర కీలక అధికారులకు చంద్రబాబు బ్రహ్మాండమైన క్వార్టర్లు కట్టించాలని డిసైడ్ అయ్యారట. న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు ఏకంగా డ్యూప్లెక్స్ హౌజులు కట్టిస్తారట. ఆ తర్వాత మిగిలిన అధికారుల కోసం 9 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కటిస్తారట. ఈ 12 వేల క్వార్టర్లు కట్టివ్వాలని ఏపీ సర్కారు డిసైడ్ చేసింది. 

ఈ మొత్తం క్వార్టర్లను ఏడు కేటగిరీలుగా డివైడ్ చేశారట. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ప్లాన్ రెడీ చేసిందట. హౌసింగ్‌ బోర్డుకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు ఈ ప్రణాళిక ఖరారు చేశారట. సీఆర్డీఏ చెబుతున్నదాని ప్రకారం.. న్యాయమూర్తులు, ఉన్నత న్యాయాధికారులు, అఖిల భారత సర్వీసులకు చెందిన సీనియర్‌ అధికారుల కోసం 3500 అడుగుల విస్తీర్ణంతో డూప్లెక్స్‌ హౌజులు కట్టిస్తారట. 


మిగిలిన కేటగిరీల ఉద్యోగుల కోసం జీ+9 అపార్ట్‌మెంట్లు కేటాయిస్తారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల నివాసాల కోసం అపార్టుమెంట్లే కడతారట. కాకపోతే ఇవి కూడా 3,500 అడుగుల ప్లింత్‌ ఏరియాతో అదిరిపోయేలా ఉంటాయట. ఇక అఖిల భారత సర్వీసుల జూనియర్‌ అధికారులు, అన్నిశాఖల ఉన్నతాధికారుల కోసం మూడు వేల అడుగుల ప్లింత్‌ ఏరియా ప్లాట్లతో అపార్ట్‌మెంట్లు కడతారట. 

ఆ తర్వాత స్థాయి అధికారులైన గెజిటెడ్‌ అధికారుల కోసం 1800 అడుగుల ప్లింత్ ఏరియాలో కడతారట. నాన్‌ గజిటెడ్‌ అధికారుల విషయానికి వస్తే వీరి కోసం 1200 అడుగుల ప్లింత్‌ ఏరియాతో కడతారట. ఇక చివరగా నాలుగో తరగతి ఉద్యోగుల కోసం 800 అడుగుల ప్లింత్‌ ఏరియా కలిగిన ప్లాట్లతో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తారట. ప్లాన్స్ రెడీ..ఇక అడ్మినిస్ట్రేషనల్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: