తెలంగాణకు మరో గుడ్ న్యూస్.. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించాలన్న కేసీఆర్ కలలకు అనుకూలంగా మరో విజయం చేకూరింది. తెలంగాణలో మరో భారీ పరిశ్రమ రాబోతోంది. అదే స్టీల్ ప్లాంట్. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు ప్రముఖ స్టీల్ కంపెనీ జైరాజ్ ఇస్పాత్ ఓకే చెప్పేసింది. 

ఈ భారీ స్టీల్ ప్లాంట్ ను మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఏడాదికి పది లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్ణయించారట. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా దాదాపు 5 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిజంగా పట్టాలెక్కితే తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఇదో కీలక మలుపు అయ్యే అవకాశం ఉంది. 


తెలంగాణను పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. దరఖాస్తు పెట్టుకున్న 15 రోజుల్లోనే పరిశ్రమకు అన్ని రకాల అనుమతలు లభించేలా చర్యలు తీసుకున్నారు. ఒక వేళ 15 రోజుల్లో అనుమతలు రాకపోతే.. అనుమతులు వచ్చినట్టే పరిశ్రమ పెట్టుకోవచ్చని కూడా టీ సర్కారు క్లారిటీ ఇచ్చింది. 

తెలంగాణ పారిశ్రామిక విధానంపై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పారిశ్రామిక విధానం బావుందని మెచ్చుకున్నారు. ఇలాంటి భారీ పరిశ్రమలు ఇంకో మూడు, నాలుగు వస్తే తెలంగాణలో పారిశ్రామిక రంగం బాగా పుంజుకునే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: