తెలంగాణలో మీడియా అంతా కేసీఆర్ జపం చేస్తోంది. ఆ పత్రిక ఈ పత్రిక అన్న తేడా లేదు.. ఆ టీవీ ఈటీవీ అన్న తేడా లేదు. అంతా ఒకటే భజన. కేసీఆర్ సర్కారుపై నెగిటివ్ కథనం ప్రచురించాలన్న ఆలోచనే పాపం ఎవరికీ వచ్చే పరిస్థితే లేదు.

ఎందుకిలా జరుగుతోంది. కేసీఆర్ పదవిలోకి వచ్చీ రాగానే మీడియాను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. తనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అన్న సంగతిని ఏబీఎన్, టీవీ9 ఛానెళ్ల ద్వారా మీడియా పెద్దలకు రుచి చూపించాడు. పాపం మీడియా వాళ్లు మాత్రం ఎంత కాలం పోరాడతారు..


చివరకు దమ్మున్న ఛానెల్ అని చెప్పుకునే ఏబీఎన్ ఎండీ కూడా కేసీఆర్ కు దాసోహం అనాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో ఓ పత్రిక ఎడిటర్ కేసీఆర్ సర్కారు తీసుకున్న చర్యలపై హైకోర్టుకు నేరుగా లేఖ రాశారు. ఆ లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.

ఎవరా పత్రికా ఎడిటర్ అంటారా.. ఆయనే టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్  కింగ్  షుక్ నాగ్ . ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం కేబీఆర్ పార్కులో చెట్లను కూల్చివేయనున్నారంటూ ఈయన రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా విచారణ స్వీకరించింది. ఓ వైపు మొక్కలు నాటుతూ మరోవైపు ఏళ్ల నాటి చెట్లను కూలిస్తే ఎలా అని వ్యాఖ్యానించింది.

హరిత హారం పేరుతో ఓ వైపు రెండు మూడడగుల మొక్కలు నాటుతూ... మరోవైపు ఇరవై, ముప్ఫై ఏళ్ల నాటి చెట్లను ఎలా నరికివేస్తారని హైకోర్టు ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: