మన రాజకీయ నాయకుల్లో ఒక్కొక్కరిని విమర్శించడానికి ఒక్కొక్కరు స్పెషల్ గా ఉంటారు. అలాగే చంద్రబాబుపై విరుచుకుపడేందుకు వైసీపీలో అంబటి రాంబాబు స్పెషల్ గా ఉంటారు. తాజాగా ఆయన చంద్రబాబుపాలన మరీ దారణంగా ఉందంటూ ప్రెస్ మీట్ పెట్టి ఏకేశారు. చంద్రబాబు పాలనలో ఏపీకి అర్థమే మారిపోయిందంటూ కొత్త అర్థాలు చెప్పారు. 

తాజాగా అంబటి వారి లెక్కల ప్రకారం ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ కాదట. చంద్రబాబు పాలనలో 'ఏపీ' అంటే 'అవినీతి ప్రదేశ్' అయ్యిందట. దీనికి తోడు.. అంబటి చంద్రబాబు పేరు కూడా మార్చేశారు. చంద్రబాబు మ‌ద్యం ఉత్ప‌త్తిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను దేశంలోనే నంబ‌ర్ 1 చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అంబ‌టి రాంబాబు మండిపడ్డారు. 


అందుకే చంద్రబాబు నాయుడు కాదు.. మందుబాబునాయుడు అంటూ సీఎంగారి పేరు మార్చేశారు అంబటి. ప్ర‌తీ ఇంటికి రూ. 2 తో 20 లీట‌ర్ల మంచినీళ్ల‌ను ఎన్టీయ‌ార్ సుజ‌ల‌స్ర‌వంతి ద్వారా అందిస్తామ‌ని చెప్పిన చంద్రబాబు.. రెండు చుక్క‌ల నీరు కూడా అందించ‌డం లేద‌న్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిని గాలికి వదిలేసిన ప్రభుత్వ అధికారులు నారా వారి సారా స్రవంతిని విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారన్నారు. 

చంద్రబాబు పాలనలో 8.78 కోట్ల ఫ్రూఫ్ లీట‌ర్ల మ‌ద్యాన్ని ప్రైవేట్ రంగంలో ఉత్ప‌త్తి చేయాల‌ని ఏకంగా ఒక జీవోను విడుద‌ల చేశార‌ని విమర్శించారు అంబటి. మళ్లీ కొత్త‌గా 1,489 ల‌క్ష‌ల ఫ్రూఫ్ లీట‌ర్ల‌ మ‌ద్యం ఉత్ప‌త్తికి అనుమ‌తుల‌ను మంజూరు చేస్తూ మ‌రో జీవో కూడా విడుద‌ల చేశారట. చంద్ర‌బాబు వ‌చ్చిన త‌ర్వాత హైవేలు అయిన ప‌ర్వాలేదు... మ‌ద్యం దుక‌ణాల‌ను ప్రారంభించండి అని అధికారుల‌కు చెప్ప‌డ‌మే కాకుండా టేట్రాప్యాక్‌ల‌ను తీసుకురావ‌డం సిగ్గు చేటని అంబటి రాంబాబు మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: