ఒక ఉద్య‌మ నేత రాజ‌కీయాల్లోకి వ‌స్తే  ఆ పాల‌న ఎలా ఉంటుందో ఉహించవచ్చు. ప్ర‌జా స‌మస్య‌ల పై ఉద్య‌మ కారుల‌కు ఉన్నంత అవ‌గాహాన సోకాల్డ్ రాజ‌కీయ నాయ‌కుల‌కు ఉండ‌దు. ప్ర‌జా  అవగాహ‌న ఉన్న నేత‌లు ప్ర‌జా స్వామ్యం పాల‌న‌ను కొన‌సాగిస్తే ప్ర‌జ‌ల‌కు కొంత వ‌ర‌కు న్యాయం జరిగే అవ‌కాశాలు ఎక్కువ‌నే చెప్పొచ్చు. అయితే తాజాగా మ‌రో పౌర హక్కుల  ఉద్య‌మ నేత రాజ‌కీయాల్లోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఆమె అసోం ఉక్కు మ‌నిషి గా పేరుగాంచిన ఇరోమ్ ష‌ర్మీల‌(42) రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లు  తెలుస్తోంది. అయితే  ఇక్క‌డ ఇతర పౌర హ‌క్కుల నేత‌ల్లో ష‌ర్మీల కు ఓ ప్ర‌త్యేకత ఉంది. ఆమె ఇంఫాల్ లో భ‌ద్ర‌తా ద‌ళాలు జ‌రిపిన కాల్పుల‌కు నిర‌స‌న‌గా 2000 సంవ‌త్స‌రం నవంబ‌ర్ నుంచి సైనిక ద‌ళాల  ప్ర‌త్యేకాధికారాల చ‌ట్టాన్ని ఉప‌సంహ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ ఇరోమ్ ష‌ర్మీల నిరాహార దిక్ష‌కు దిగారు.

ఆమ‌ర‌ణ నిరహార దీక్షకు దిగిన ఇరోమ్ ష‌ర్మీల‌

దాదాపుగా 16 ఏళ్ల పాటు ఆమె పూర్తిగా పేరెంటల్ న్యూట్రిష‌న్ ద్వారా మాత్ర‌మే జీవిస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆమె క‌నీసం  మంచి నీరు కూడా ముట్ట‌లేదు. సాయుధ బ‌ల‌గాల ప్ర‌త్యేక అధికారాల‌ల చ‌ట్టం(ఏఎఫ్ ఎస్ పీఏ) ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆమె ఈ దీక్ష కు దిగారు. అయితే 2000 న‌వంబ‌ర్ 2 న ఇంఫాల్ లోయ‌లోని మ‌లోంలో అసోం రైఫిల్స్  ఎన్ కౌంట‌ర్ లో ప‌ది మంది పౌరులు చ‌నిపోయారు. వాస్త‌వానికి ష‌ర్మీల పౌర‌హ‌క్కుల కార్య‌కర్త గా వ్య‌వ‌హారిస్తున్నారు. ఎన్ కౌంట‌ర్ పై గ‌ళ‌మెత్తారు. ఆమె ఎన్నిసార్లు దీనిపై ఉద్య‌మాలు చేసినా కేంద్ర స‌ర్కార్ మాత్రం వెనక్కుత‌గ్గ‌లేదు. అంతేకాకుండా సాయుధ బ‌ల‌గాల మోహ‌రింపు రోజు రోజుకు పెరిగి పోతూ వ‌స్తోంది. దీంతో ఆమె 5 వ తేది న‌వంబ‌ర్ 2000 నుంచి నిరాహార‌దీక్ష చేపట్టారు. మానవ హ‌క్కుల ఉద్య‌మ‌కారులు  కిరాత‌క‌మైన చ‌ట్టంగా అభివ‌ర్ణించే సాయుధ బ‌ల‌గాల
ప్ర‌త్యేక అధికారాల చ‌ట్టాన్ని ర‌ద్దుచేయాల‌ని ఆమె డిమాండ్ చేస్తూ ఇప్ప‌టికీ  త‌న దీక్ష పై వెన‌క్కి త‌గ్గ‌లేదు.

ష‌ర్మీల పై ఆత్మాహత్యయ‌త్నం కేసు న‌మోదు

ఆమెకు గ‌త 16 ఏళ్లుగా ముక్కు ద్వారా బ‌ల‌వంతంగా ప్లూయిడ్స్ అందిస్తున్నారు. అప్ప‌టి నుండి మొక్క వోని దీక్ష‌తో ష‌ర్మిల నిరాహార దీక్ష  చేస్తున్న‌ప్ప‌టికీ ఈ చ‌ట్టం పై ప్ర‌భుత్వం ఏమాత్రం స్పందించ‌డం లేదు క‌దా... ఆమె దీక్ష విర‌మించేందుకు స‌ర్కార్ చేసిన ప్ర‌య‌త్నాలు లేవు. ఆమె పై 2006 లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదు చేసి క‌స్ట‌డీకి తీసుకున్నారు. అప్ప‌టినుంచి ఆమెను ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి ముక్కుద్వారా ద్రవ ప‌దార్థాలు అంద‌జేశారు. అయితే సెక్ష‌న్ 309 కింద అమె పై మోపిన  అత్మ‌హాత్యాయ‌త్నం ఆరోప‌ణలు ప్రాసిక్యూష‌న్ నిరూపించ‌లేపోయింద‌ని గ‌తంలోనే కొర్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాదు స‌ర్కార్ పై మొట్టి కాయ‌లు వేసిన కోర్టు జుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉన్న ష‌ర్మీల‌ను త‌క్షణం విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.  అయితే దీనిపై ష‌ర్మిల స్పందిస్తూ... గాంధేయ మార్గంలో న‌డుస్తున్నాన‌ని, త‌న‌ను జైలో ఉంచినా, బ‌య‌ట ఉంచినా ఆ చ‌ట్టం ఉప‌సంహ‌రించే వ‌ర‌కూ తన పోరాటం సాగిస్తాన‌ని వెల్ల‌డించారు. 

ఈశాన్య రాష్ట్రాల్లో సైన్యం హింసా కాండ‌కు అంతులేదు.

వాస్త‌వానికి ఈశాన్య రాష్ట్రాల్లో భార‌త సైన్యం  సృష్టిస్తున్న భ‌యోత్పాతం, సాగిస్తున్న హింసాకాండ‌కు అంతులేకుండా పోతుంది. సైన్యం క‌బంధ హ‌స్తాల్లో ఉన్న ఆ రాష్ట్రాల్లో తుపాకులు మాత్ర‌మే మాట్లాడతాయి. మ‌ణిపైర్ లో ఈ మ‌ధ్య కాలంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న భ‌ద్ర‌త ద‌ళాల క‌ర్క‌శ‌త్వానికి మ‌రో నిద‌ర్శ‌నం. ఈ సంఘ‌ట‌న కాస్త ఆల్య‌సంగా వెలుగులోకి వ‌చ్చింది. మ‌ణిపూర్ లో ఇన్న‌ర్ లైన్ ప‌ర్మిట్ అంశం పై ఇటీవ‌ల పెద్ద ఎత్తున హింస చెల‌రేగాయి. అల్ల‌ర్ల సంద‌ర్భంగా ఇంఫాల్ లో క‌ర్ప్యూ విధించారు. నిర్మానుషంగా ఉన్న ఓ వీధిలో భ‌ద్రత ద‌ళాలు పెట్రోలింగ్ కు వెళ్లాయి. ఆ వీధిలో ఇద్ద‌రు యువ‌కులు భ‌ద్ర‌త సిబ్బందికి క‌నిపించారు. అంతే జ‌వాన్లు మాన‌వ‌త్వం మ‌ర‌చి న‌డివీధిలో యువ‌కుల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. రైఫిళ్ల తో వాళ్ల‌ని కొడుతూ గాలిలోకి కాల్పులు  జ‌రుపుతూ  భ‌యకంపితుల‌ను చేశారు. ఆ యువ‌కులు చేసిన త‌ప్ప‌ల్లా సైన్యానికి క‌నిపించ‌డ‌మే. అక్క‌డ సైన్య‌పు క‌వాతులు మాత్ర‌మే క‌నిపించాలి సైన్యపు ప‌ద ఘ‌టన‌లు, తుపాకీ శ‌బ్ధాలు మాత్ర‌మే వినిపిస్తున్నాయి.  

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ఇరోమ్ ష‌ర్మీల

మనం సరిగ్గా చూడగల్గితే అక్కడ ప్రజాస్వామ్యం సైన్యం బూట్లకింద బిక్కు బిక్కు మంటూ మూగగా రోదిస్తూ కనిపిస్తుంది. దీంతో మ‌ణిపూర్ పౌర‌హ‌క్కుల నేత ఇరోమ్ ష‌ర్మీల సైన్యం పై ప్ర‌జాస్వామిక యుద్దం ప్ర‌క‌టించింది. అయినా స‌ర్కార్ స్పందించక‌పోవ‌డం తో ఇక  ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో రావాల‌న్న భావ‌న‌లో ఉన్నారు.  వ‌చ్చే నేల అంటే అగ‌ష్టు 9 న సుదీర్ఘ నిరహార దీక్ష ను విర‌మించనున్నారు. దీక్ష విరమించిన అనంత‌రం ఆమె వివాహం చేసుకుంటార‌ని, ఆ త‌రువాత అసోం ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు తెలుపుతున్నాయి.  అయితే పౌర హ‌క్కుల నేత వ్య‌వహారించిన ష‌ర్మీల ఒక్క‌సారిగా రాజ‌కీయాల్లోకి రావ‌డం పై కొంత విశ్లేష‌ణ అవ‌స‌రం. ఆమె గ‌తంలో సామాన్య ప్ర‌జ‌ల పై గ‌ళం విప్పారు. ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్షం లో ఉంటూ అధికార ప‌క్షాన్ని నిల‌దీస్తూ వ‌చ్చారు. అంతేకాదు ష‌ర్మీల పేరు చెబితేనే అధికార ప‌క్షాలు చెమ‌ట‌లు ప‌ట్టించారు. 

అయితే పౌర‌హ‌క్కుల నేత‌లు ఉద్య‌మాలు చేయ‌డంలో ఆధ్యులు. కానీ రాజ‌కీయంగా వారు రానిస్తారా అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. గ‌తంలో పౌర హ‌క్కుల పై నిల‌దీసిన నేత‌లు రాజ‌కీయాల్లో కొంత వ‌ర‌కు రానించ లేక‌పోయారు. సామాజిక ఉద్య‌మ నేత అన్నా హజారే సైతం ఇదే కొవకు వ‌స్తారు. అయితే  అన్నా హాజారే ఉద్య‌మ సమ‌యంలో ప్ర‌పంచ దేశాల్లోనే మంచి మ‌న్న‌న‌లు పొందారు కానీ రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆయ‌న ఆలోచ‌న పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. ఆయ‌న గతంలో రాజ‌కీయ పార్టీ ని ఎర్పాటు చేస్తాన‌ని తెలిపినా ఆ స్థాయి లో స‌మీక‌ర‌ణలు జ‌ర‌గ‌లేదు. ఇక  తాజాగా ఇరోమ్ ష‌ర్మీల సైతం రాజ‌కీయాల్లోకి రావ‌డంతో ఆమె చేస్తున్న ఉద్య‌మాల‌పై న్యాయం జ‌రిగేనా అన్న అనుమానం రాక‌మాన‌దు.  ఇంత‌కీ ఆమె రాజ‌కీయాల్లో కి వ‌స్తారా అన్న సందేహం కూడా కొంత వ‌ర‌కు ఉంది. ఇప్ప‌టికే రాజ‌కీయాల్లో భారీ చ‌ర్చే జ‌రుగుతుంది. ఇక‌పోతే... ఇరోమ్ ష‌ర్మీల రాజ‌కీయ ప్రవేశం పై మ‌రికొన్ని రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: