పెట్టుబడులు, పరిశ్రమల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. అమరావతి ప్రాంతంలోనే కాకుండా ఏపీలోని మిగిలిన జిల్లాల్లోనూ పరిశ్రమలు రావాలని ఏపీ సర్కారు చేసిన ప్రయత్నాలు కొంతవరకూ సఫలీకృతం అవుతున్నాయి. తాజాగా మరో 6 భారీ పరిశ్రమలు ఏపీలో ఏర్పాటయ్యేందుకు రంగం సిద్ధం అయ్యింది. 

ఈ మూడు భారీ పరిశ్రమల్లో మూడు కర్నూలు జిల్లాలోనే ఏర్పాటుకాబోవడం విశేషం. మిగిలిన మూడింటిలో రెండు నెల్లూరు జిల్లాలోనూ.. మరొకటి విశాఖపట్నంలోనూ ఏర్పాటు కానున్నాయి. ఇటీవల జరిగిన రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఈ మేర నిర్ణయం తీసేసుకున్నారు. 


జైరాం ఇస్పాత్ లిమిటెడ్ తన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ను కర్నూలు జిల్లాలో రూ. 2, 938 కోట్లు పెట్టుబడితో ప్రారంభించబోతోంది. దీని ద్వారా వెయ్యిమందికిపైగా ప్రత్యక్షంగా, మరో ఐదువేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఎంపీఎల్ మినరల్ ప్రాజెసింగ్ లిమిటెడ్ కూడా తన స్టీల్ ప్లాంట్ ను కర్నూలు జిల్లాలో రూ.  687 కోట్ల పెట్టుబడితో ప్రారంభిస్తుంది. 

900 కోట్ల పెట్టుబడితో శాంతారామ్ కెమికల్స్ కూడా కర్నూలు జిల్లాలో కెమికల్ ప్రాజెక్టు ప్రారంభిస్తుంది. వీటితో పాటు రెడ్సోస్ సీమ్ లెస్ సంస్థ, స్ధాన్ కోకాకోలా సంస్థలు  నెల్లూరు జిల్లాలలోనూ... వ్యాస్ క్యాన్సర్ రీసెర్చ్  సంస్థ విశాఖపట్నంలోనూ తమ పరిశ్రమలను ఏర్పాటు చేస్తాయి. మొత్తం ఈ ఆరు పరిశ్రమలు ద్వారా రాష్ట్రానికి 10 వేల  కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. మొత్తం 20 వేల మందికి ఉపాధికి దొరుకుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: