దేశంలో రోజు రోజుకీ మానవత్వం పూర్తిగా నశిస్తుంది. మనిషి సమాజంలో బతకాలంటే ఆస్తీ ఉంటే చాలు అనే అజ్ఞానంలో చాలా మంది ఏంతటి దుర్మార్గానికైనా వడికడుతున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఈ మనుషులు నిజంగా మనుషులేనా మానవత్వం అనేది ఉందా అనే  అనుమానం కలుగుతుంది. ఆస్తి కోసం విడాకులు ఇచ్చిన మాజీ భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీసీఐడీకి సూచించింది. సంపన్న కుటుంబంలో పుట్టడమే అతను చేసిన పాపం. పారిశ్రామికవేత్త రాజన్, లిస్సీ రాజన్ దంపతులకు 1979లో మనోజ్ రాజన్ జన్మించాడు. మనోజ్ పుట్టుకతోనే చెవిటి, మూగ. అంతేగాక వయసుతో పాటు అతని మానసిక స్థితి ఎదగలేదు.

1993లో మనోజ్ తల్లి మరణించాక అతణ్ని ఓ ప్రత్యేక స్కూల్లో చేర్పించారు. 2008లో రాజన్ ఓ సంబంధం చూసి ప్రియ దర్శిని అనే అమ్మాయితో మనోజ్కు వివాహం జరిపించాడు. చెన్నై మైలాపూర్లోని ఓ చర్చిలో ఈ పెళ్లి జరిగింది. పెళ్లయిన కొన్నేళ్లకు భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. భరణం కింద 4 లక్షల రూపాయలు పొందింది.   ఇంతలోనే తండ్రి కూడా మరణించాడు. దీంతో ఆప్తుల సంరక్షణలో ఉన్న ఈ అభాగ్యుడికి మాజీ భార్య రూపంలో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. చివరకు కోర్టు ఆదేశాలతో సురక్షిత ప్రదేశానికి తరలించారు. ప్రియదర్శిని తన మాజీ భర్తను కిడ్నాప్ చేశారని మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు విచారణ జరిగింది.

మనోజ్ మాజీ భార్య ప్రియదర్శిని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తరువాత గత మే నాలుగవ తేదిన ప్రియదర్శిని తన బంధువులతో కలిసి మనోజ్ ను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతంలో దాచి పెట్టింది. రెండు రోజుల తరువాత తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకుంది. మనోజ్ ను రక్షించాలని అతని సంరక్షకుడు అనంతన్ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించాడు.  అమాయకుడైన తన భర్తను మోసం చేసింనందుకు మనోజ్ ను కిడ్నాప్ చేసి అక్రమంగా అతని ఆస్తిని విక్రయించిన ప్రియదర్శిని, ఆమెకు సహకరించిన బంధువుల మీద కేసు నమోదు చెయ్యాలని న్యాయస్థానం పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు సీబీసీఐడికి అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: