డీజిల్‌ ధరలను ప్రతి నెల 40 నుంచి 50 పైసలు పెంచుతామని, డీజిల్‌పై సబ్సిడీని పూర్తిగా తొలగించే వరకు ఈ ధరల పెరుగుదల ఇలాగే ఉంటుందని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ సెలవిచ్చారు. మళ్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకు ప్రతి నెల లీటరు డీజిల్‌పై 40 నుంచి 50 పైసల పెరుగుదల ఉంటుందని, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ పెరుగుదలను అమలు చేస్తాయని వివరించారు. జనవరి 17న చమురు మార్కెటింగ్‌ కంపెనీలు స్వతంత్రంగా డీజిల్‌ ధరలను నిర్ణయించటానికి ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చింది. దీని ద్వారా బడ్జెట్లో పెట్రో లియం ఉత్పత్తుల ధరల వల్ల ప్రభుత్వంపై పడుతున్న సబ్సిడీ భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో జనవరి 18న లీటరు డీజిల్‌ ధరను చమురు కంపెనీలు 45 పైసలు పెంచాయి. ప్రస్తుతం ఒక్కొలీటర్‌ డీజిల్‌ అమ్మకం మీద రూ. 10.80 నష్టపోతున్నట్లు చమురు కంపెనీలు చెబుతున్నాయి. భారత్ ప్రస్తుతం దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడవలసి వస్తున్నది, ఈ భారాన్ని తగ్గించటానికి విజయకేల్కర్‌ నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసి , దాని సూచనలను ప్రభుత్వం 'మెల్ల'గా అమలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: