ఎవ‌రీ  న‌యీం..!  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారత‌దేశ‌మంత‌టా తెలుసుకోవాల్సిన విష‌యం. న‌యీం అలియాస్ న‌యీముద్దీన్, అలియాస్ భువ‌న‌గిరి న‌యీం. ఇలా విభిన్న పేర్ల‌తో, పోలీసుల‌కే కాదు, త‌మ అనుచ‌రులు కూడా ఈ న‌యీం ను క‌ల‌వాలంటే.. పెద్ద సాహ‌స‌మే. న‌యీం ప‌థకం వేసారంటే అది ఎవ‌రైనా మ‌ట్టి క‌ర‌వాల్సిందే. ఆయ‌న వ్యూహాలు ఎలా ఉంటాయంటే... చేసే హ‌త్య ను చూసిన వారు క‌నీసం న‌యీం పేరు చెబితేనే బ‌య‌ప‌డేలా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇత‌డొక న‌ర రూప రాక్ష‌సుడు. న‌యీం పేరు చెబితే...రాజకీయ నాయకులు, ప్రజా హ‌క్కుల సంఘాల నేత‌లు, మాజీ మావోయిస్టు నేత‌లు, మావోయిస్టులు చిన్న చిన్న వ్యాపారుల నుంచి పెద్ద రియ‌ల్ట‌ర్లు భ‌య‌ప‌డాల్సిందే. 17 సంవత్స‌రాల చ‌రిత్ర లో భువ‌న‌గిరి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఆయ‌న‌ను వ్యతిరేకించిన వారంటూ ఉండరు. ఒక‌వేళ  అలాంటిదే జ‌రిగితే విచ్ఛ‌క్ష‌ణ ర‌హితంగా చంప‌డం న‌యీం కు వెన్న తో పెట్టిన విద్య‌. ఈ గ్యాంగ్ స్ట‌ర్ కు భువ‌న‌గిరి లోనే కాదు... దాదాపు దేశ వ్యాప్తంగా అనుచ‌రులు ఉన్నారు. ఎంత న‌మ్మ‌కపు అనుచ‌రునైనా ఒక రెండు రోజుల్లో మారుస్తూ ఉంటారు. ఈయ‌న ఉండేది క‌నీసం అత‌ని వ‌ద్ద ఉండే డ్రైవ‌ర్ కూడా తెలియ‌కుండా ఉంటారు.

చిన్న‌నాటి నుంచే న‌యీం భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం....

న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరి లోని భీచ్ మెహ‌ల్లా ప్రాంతంలో ఇతని నివాసం. తండ్రి న‌సీరుద్దిన్ కు ఇద్ద‌రు కుమారులు  ఇద్ద‌రు కుమార్తెలు. చిన్న నాటి నుంచే భిన్న‌మైన మ‌న‌స్త‌త్వం ఉన్న న‌యీం.... పాముల‌తో, తేళ్ల తో స్నేహం  ఎక్కువ‌. భువ‌న‌గిరి తాను చదువుకునే కాలేజీలో సంచుల్లో పాములు, తేళ్ల తీసుకుని వ‌చ్చి త‌న సాటి విద్యార్థుల‌ను భ‌యంకంపితుల‌ను చేసేవారు. చిన్న నాటి నుంచే ప్ర‌త్య‌ర్థి ఎలా కొట్టాలి... ఎలా లొంగ‌దీసుకోవాల‌ని, ఎందుటి వారు ఎలా భ‌య‌ప‌డుతారన్న ఆలోచ‌న‌తో ఉంటూనే మార్ష‌ల్ హార్ట్స్  నేర్చుకున్నారు. న‌యీం కరాటే లో బ్లాక్ బెల్ట్ ను సంపాధించారు. అప్ప‌ట్లో క‌రాటే మాస్ట‌ర్ బాల‌రాజ్ కు న‌యీం మంచి స్నేహితుడు గా ఉండేవాడు. 1990 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతాల్లో న‌క్స‌లైట్ల ప్రాబ‌ల్యం ఎక్కువ‌గా ఉండేది. న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరి ప్రాంతంలో ప్రతి ఊరిలో న‌క్స‌లైట్ల సానుభూతి ప‌రులు ఉండేవారు. చాలా మంది యువ‌త విద్యార్థి ద‌శ నుంచే రాడికల్స్ స్టూడెంట్ యూనియ‌న్ లో క్రీయాశీలంగా  ప‌నిచేసేవారు. అప్ప‌ట్లో న‌క్స‌లైట్ల పై నిషేదం ఉండేది కాదు. 

ఐపీఎస్ వ్యాస్ ను అతి స‌మీపంలో చంపాడు...

భువ‌న‌గిరి ఓ డిగ్రి కాలేజీలో గ్రాడ్యూయేష‌న్ పూర్తి చేసుకున్న న‌యీం 1990 లో  స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా( ఎస్ఎఫ్ఐ) లో ప‌నిచేసిన న‌యీం స‌మ స‌మాజ స్థాప‌న కోస‌మంటూ పీపుల్స్ వార్ లో చేరాడు. చేరిన కొద్ది రోజుల్లోనే అప్పటి వార్ అగ్రనేత‌లు ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి, శాఖ‌మూరి అప్పారావు ల వ‌ద్ద శిష్య‌రికం చేసి, వారితో అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. 1993 లో ఎల్బీ స్టేడియం వ‌ద్ద పులి అంజయ్య, ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి, మోడెం బాల‌కృష్ణ ల సాయంతో నాటి గ్రెహౌండ్ ఐపీఎస్ అధికారి వ్యాస్ ను ఏకే -47 తో పాయింట్ బ్లాంక్ రేంజీ హ‌త‌మార్చారు. అప్ప‌టి నుంచి అజ్ఞాతం లో ఉన్న న‌యీం పీపుల్స్ వార్ తో చెల‌రేగిన అంత‌ర్గ‌త విభేదాల‌తో ప‌టేల్ సుధాక‌ర్, శాఖ‌మూరి అప్పారావుల‌తో గొడ‌వ‌ప‌డ‌టంతో పార్టీ నుంచి  త‌ప్పుకున్నాడు.  అయితే నాటి నుంచి పీపుల్స్ వార్ పార్టీ వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టారు. ఇదీలా ఉంటే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అరుణోద‌య సాంస్కృతిక స‌భ్యురాలు, ప్ర‌జా గాయ‌ణి బెల్లి ల‌లిత‌ను 1999 లో న‌యీం త‌మ్ముడు అలీమొద్దీన్ అతి క్రూరంగా చంపారు. బెల్లి ల‌లిత‌ను 18 ముక్కులుగా చేసిన భువ‌న‌గిరి వివిధ ప్రాంతాల్లో ప‌డవేశారు. అప్ప‌ట్లో ఈ హ‌త్య‌కు ఓ అధికార పార్టీ కీల‌క‌నేత న‌యీం తో చంపించారన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. 
 
బెల్లి ల‌లిత‌ను దారుణంగా చంపిన న‌యీం, త‌న సోద‌రుడు...

అయితే ఈ హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో న‌యీం... వ్యాస్ హత్య‌కేసులో అండ‌ర్ ట్ర‌య‌ర్ ఖైదీగా ఉన్నాడు. బెల్లి ల‌లిత హ‌త్యానంత‌రం పీపుల్స్ వార్... నయీం త‌మ్ముడిని అలీమొద్దిన్ ను బీబీ న‌గ‌ర్ మండ‌లం బొల్ల‌పెల్లి లో చంపేశారు. దీంతో పీపుల్స్ వార్ పై మ‌రింత క‌క్ష పెంచుకున్న న‌యీం పీపుల్స్ వ్య‌తిరేక ఉద్య‌మ నేత‌గా ఎదిగారు. పీపుల్స్ వార్ లో ప‌నిచేసే వారిని ఏరి పారేయ‌డమే కాకుండా పోలీసుల‌కు కోవ‌ర్టుగా మారాడు. మావోయిస్టు , మావోయిస్టు సానుభూతి ప‌రుల‌పై న‌యీం త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. పీపుల్స్ వార్ అరాచ‌కాల‌ను న‌శించాలంటూ భారీ ఉద్య‌మ‌మే చేశాడు. ఇక పోలీసులు పెద్ద పెద్ద ఆపీస‌ర్ల తో స్వేహ పూర్వ‌కంగా ఉంటూ వ‌స్తూ, వారీ ప్రోత్బ‌లంతో  రెచ్చిపోయాడు న‌యీం. న‌యీం మావోయిస్టుల కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుడ‌టంతో పోలీసులు కూడా అత‌ని ఆగ‌డాల‌ను చూస్తూ మిన్న‌కుండిపో మారు. ల్యాండ్ సెటిల్ మెంట్లు, ఆర్థిక లావాదేవిల్లో న‌యీం గ్యాంగ్ ఆరితేరిపోయింది. 2001 ఏపీసీఎల్సీ జిల్లా కార్య‌ద‌ర్శి ఆజం ఆలీని క‌త్తుల‌తో విచ్చ‌క్ష‌ణ రహితంగా న‌రికి చెంపేశారు.  

సినీ ప‌క్కిలో న‌యీం ప‌క్కా ప్లాన్...


పోలీసుల నీడ‌ల్లో న‌యీం గ్యాంగ్ ఆరాచాకాల‌ను నిల‌దీసినందుకు ఎంతో మందిని నరికి చంపిన న‌యీం శాక‌మూరి అప్పారావు, ప‌టేల్ సుధాక‌ర్ రెడ్డి, ఆజాద్ , సోమన్న‌, కొన‌పూరి సాంబ‌శివ‌రావు త‌న తమ్ముడు కోన‌పూరి రాములు  ధారుణంగా హ‌త‌మార్చాడు. మావోయిస్ట్ విదానాల‌కు వ్య‌తిరేకించి పోలీసుల‌కు స‌రెండ‌రైన మావో కీల‌క నేత సాంబ‌శివ‌రావు ను చంపేందుకు న‌యీం చేసిన ప్ర‌య‌త్నాలు ఇంతా అంతా కాదు. ఆయ‌న టార్గెట్ చేసిన ఏ వ్య‌క్తి కైనా ముందుగా వారి ఇంటికి సంకేతాలు పంపుతారు. పాముల‌ను ప్యాక్ చేసి ఇంటికి పార్శిల్ పంప‌డం. ఫోన్ ల ద్వారా వార్నింగ్ లు ఇవ్వ‌డం, తెల‌చీర‌, గాజులు, మ‌ల్లెపూలు పంపుతూ భ‌య భ్రాంతులు గురి చేస్తాడు. అప్ప‌టికి అత‌ను సరెండర్ కాక‌పోతే ప్ర‌త్య‌క్షంగా క‌త్తుల‌తో, తుపాకుల‌తో  త‌న అనుచరుల‌తో దాడి చేసి హ‌త మార్చుతారు. అయితే  48 గంట‌లోనే త‌న అనుచ‌రుల‌ను పోలీసులకు లొంగి పోయేలా ప్లాన్ చేస్తాడు. అయితే ఇక్క‌డ దాడులు చేసే వారు ఒక‌రైతే... లొంగి పోయేవారు మ‌రోక్క‌రు లా ఉంటారు. దీంతో పోలీసుల‌కు సైతం అర్ధం కాకుండా ప్లాన్ చేయ‌డం కేవ‌లం న‌యీంకే సొంతం. అంతా సినీ ప‌క్కిలో క‌థ ముగింపు ప‌లుకుతాడు.

సోహ్ర‌బుద్దీన్ ఎన్ కౌంటర్ లో ప్ర‌ధాన నిందితుడు...

నయీం కేవలం తెలుగు రాష్ట్రాల‌లోనే మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్ట‌ర్ కాదు. ఈయ‌న గురించి ఇత‌ర రాష్ట్రాల పోలీసులే కాకుండా సీబీఐ సైతం జ‌ల్లెడ‌ప‌డుతుంది. 2002 డిసెంబ‌ర్ లో న‌యీం త‌న నెట్ వ‌ర్క్  ను విస్తృతం చేసుకునే దిశ‌లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లి ఐఎస్ఐ ల‌తో చేతులు కలిపిన‌ట్లు స‌మాచారం. 2008 ఏప్రిల్ లో చోట‌రాజ‌న్ అనుచ‌రుడు అజీజ్ రెడ్డి ఎన్ కౌంట‌ర్ వెనుక కూడా న‌యీం గ్యాంగ్ తో విభేదాలు ఏర్పాడ్డ‌య‌ని స‌మాచారం. న‌ల్ల‌మ‌ల్ల కోబ్రాస్, కాక‌తీయ‌కోబ్రాస్, న‌ర్సా కోబ్రాస్, క్రాంతి సేన పేరిట చేల‌రేగిన న‌యీం రాష్ట్రంలోనే కాక ఛ‌తీష్ ఘ‌డ్. జార్ఖండ్, ప‌శ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో త‌న నెట్ వ‌ర్క్ ను పెంచుకుంటూ మావోయిస్టుల వేట ప్రారంభించారు.  దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సొహ్ర‌బుద్దీన్ బూట‌క‌పు ఎన్ కౌంట‌ర్ కేసులో న‌యీం కోసం గుజ‌రాత్ పోలీసుల‌తో పాటు సీబీఐ కూడా గాలిస్తోంది. కానీ వారెవ్వ‌రికీ అత‌ని జాడైనా తెలియ‌లేదు. ఇక సైబరాబాద్, హైద‌రాబాద్ ల‌క‌కు చెందిన కొంద‌రు యువ‌కుల‌కు, నేర‌గాళ్ల‌ను చేర‌దీసి నయీం త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించాడు. ఈ ముఠా కుట్ర‌ల్ని జంట  క‌మిష‌న‌రేట్ పోలీసులు అనేక సార్లు చేదించారు.

నయీం ప్ర‌ధాన అనుచ‌రులు లొంగుబాటు...

నేరాల‌కు పాల్ప‌డేది ఒక‌రైతే... 48 గంట‌ల్లోనే లొంగిపోయే వారు మ‌రొక‌రు. అందుకే ఏ కేసులోనూ నయీం వ్య‌వ‌హారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు. ఇక తాజా గా న‌యీం టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జా ప్ర‌తినిదుల‌ను టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. భువ‌న‌గిరిఎమ్మెల్యే, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే లకు చంపుతామ‌ని  బెదిరింపుల‌కు పాలు ప‌డ్డ న‌యీంను మ‌ట్టుబెట్టేందుకు గత కొన్ని రోజులుగా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో అడుగులు వేశారు పోలీసు బాసులు. ఇప్ప‌టికే ఈ డాన్ ప్ర‌ధాన అనుచ‌రులుగా ఉన్న ష‌కీల్ గ‌త కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో చ‌నిపోగా.. మ‌రో ఇద్ద‌రు అనుచ‌రులు పాశం శ్రీనివాస్, సుదాక‌ర్ లు ఎస్పీ సమ‌క్షంలో లొంగి పోయారు. ఇక మిగిలిన పెద్ద తిమింగ‌ల‌మైన న‌యీం ను ఒంట‌రిని చేసి పక్కా ప్ర‌ణాళిక‌తో నేడు ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా షాద్ న‌గ‌ర్ శివారులో ఉన్న మిలినియం ఎన్ క్లేవ్ లో న‌యీం నివాసంగా భావిస్తున్న ఇంటి ని చుట్టుముట్టిన గ్రైహౌండ్ పోలీసులు అనివార్య ప‌రిస్థితుల్లో కాల్పులు జ‌రిపారు. దీంతో ఒక్కసారిగా కుప్ప‌కూలిన న‌యీం చ‌నిపోయిన‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు.  ఏ మాట‌కి ఆ మాటే చెప్పాలి ఎలాంటి ప‌నిచేసేవాడు అలానే చ‌స్తార‌న్న‌ది మ‌రోసారి న‌యీం మృతి తో స్పష్ట‌మైంది...!

మరింత సమాచారం తెలుసుకోండి: