తమిళనాడు లో అన్నాడీఎం కే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, ఆమె కుటుంబ సభ్యులు తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ వారి ఇంట్లో పనిచేసే 22 ఏళ్ల యువతి కేసు పెట్టింది. ఆమె భర్త టి లింగేశ్వర్ తిలకన్‌తో పాటు... ఆమె కుమారుడు ప్రదీప్ రాజాలు తనను, తన సోదరిని లైంగికంగా వేధించారని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.   అంతే కాక తమను గత కొంత కాలంగా ఇంట్లో నిర్భందించి బెదిరించి లైంగిక దాడులు చేసినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.  గతంలో అన్నాడీఎంకే అధినేత్రం జయలలితపై కామెంట్ చేసినందుకు  ఢిల్లీ విమానాశ్రయంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచ్చి శివను చెంపదెబ్బ కొట్టినందుకు శశికళను సీఎం జయలలిత సస్పెండ్ చేసిన సంగతి తెల్సిందే.


అప్పటి నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలంటూ శశికళకు బెదిరింపులు వస్తున్నాయి. దీంతో తనకు భద్రత కల్పించాలంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ పీజే కురియన్‌ను కోరారు.  2015 లో శశికల ఇంటి నుంచి బాధితురాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించగా తమపై పగ పెంచుకొని  వేధించేవారని ఫిర్యాదులో బాధితురాళ్లు పేర్కొన్నారు.


అంతే కాదు తమను హింసించిన విషయం అత్యాచారం చేసిన విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని అంతే కాదు తమతో ఓ తెల్లకాగితంపై సంతకాలు కూడా తీసుకున్నట్లు బాధితురాళ్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: