తమిళనాడులో ఒకప్పుడు సీఎం జయలలితకు మంచి స్నేహితురాలిగా ఉన్న శశికళ పుష్ప ఇప్పుడు బద్ద శత్రువుగా మారింది. అంతే కాదు అన్నాడీఎంకే ఎంపీ శశికళ పుష్ప రాజ్యసభ వేదికగా అమ్మ జయలలితకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణల్ని సందించిన విషయం తెలిసిందే. తనకు ప్రాణ హానీ ఉందంటూ రాజ్య సభలో కన్నీళ్లు పెట్టి, ఢిల్లీలోని తన ఇంటికి భద్రతను కల్పించుకున్నారు. మరోవైపు  శశికళ పుష్ప ఇంట్లో పని చేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇది కాక ఇప్పుడు ఆమె ఇంటిలో పని చేస్తున్న పనిమనుషులు లైంగిక వేధింపుల కేసు పెట్టారు. దీంతో శశికళ పుష్ప ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు.

అయితే రాజసభ సభ్వత్వానికి రాజీనామా చెయ్యాలని చెప్పినా శశికళ పట్టించుకోలేదు సరికదా అమ్మ జయలలిత మాట ధిక్కరించారు.  కనీసం తమిళనాడు వైపు కన్నెత్తి చూడలేదు.

తాజాగా శశికళ, ఆమె కుటుంబంపై పనిమనిషి నమోదుచేసిన లైంగిక వేధింపుల కేసులో ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎంపీ శశికళ, మరో ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వుల్ని ఇచ్చింది. దీంతో ఎంపీ శశికళకు కాస్త ఊరట లభించినట్లు అయ్యింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: