రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు...డబ్బులున్న వారు కొండ మీది కోతినైనా కొని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది.  ఇప్పటి వరకు బంగారం కార్లు, బంగారు మోటర్ బైకులు, వాచీలు లాంటివి చూశాం...ఈ సారి ఏకంగా బంగారు విమానం చూసి  ఆస్ట్రేలియాలోని పెర్త్ వాసులు నోళ్లు వెళ్లబెట్టారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో దిగిన బంగారపు ప్రయివేట్ విమానాన్ని చూసి స్థానికులు షాక్ కు గురైనారు. ఈ బంగారపు విమానం విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ. 668 కోట్లు) ఉంటుందని భావిస్తున్నారు. విమానంలో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. అయితే ఇన్నివందల కోట్లు ఖర్చు పెట్టి మరీ బంగారపు విమానం తయారు చేయించుకున్న వ్యక్తి ఇప్పుడు ఆస్ట్రేలియాలో హాటా టాఫిక్ గా మారారు.
బంగారపు విమానం ఖరీదు ఎంతో తెలుసా?
మలేషియాలోని జొహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ ఈ బోయింగ్ 737- బంగారపు ప్రయివేట్ విమానం యజమాని. మలేసియాలోని జొహర్ సుల్తాన్ ఇబ్రహీం ఇస్మాయిల్ తన భార్య రాజా జారీత్ సోఫియాతో కలిసి పశ్చిమ ఆస్ట్రేలియాలో సెలవులు గడిపేందుకు పసిడి విమానంలో ఇక్కడికి వచ్చారు.పెర్త్ నగరంలో సుమారు రూ.43 కోట్ల రూపాయల (6.5 మిలియన్ డాలర్లు) విలువైన విలాసవంతమైన భవంతి కూడా సుల్తాన్ ఇబ్రహీంకు ఉంది.

ఆయన మొత్తం సంపద దాదాపు రూ.6,680 కోట్లు (బిలియన్ డాలర్లు). తానెంతో కష్టపడి సంపద పోగు చేశానని ఆయన ఒక సందర్బంలో చెప్పారు.బోయింగ్ 737 చెందిన ఈ విమానంలో విలాసవంతమైన సదుపాయాలున్నాయి. డైనింగ్ రూము, బెడ్ రూము, షవర్, మూడు వంట గదులు ఇందులో ఉన్నాయి. సుల్తాన్ అవసరాలకు అనుగుణంగా ఈ విమానాన్ని తయారు చేయడానికి రెండేళ్లు పట్టింది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: